Pak Cricketer: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వివాదాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. పాకిస్తానీ క్రికెటర్లు (Pak Cricketer) తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. దీని కారణంగా వారు పాకిస్తాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతారు. ఇప్పుడు ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది అంటే నమ్మడానికి కాస్త కష్టమే. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఓ పాకిస్థానీ క్రికెటర్ అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ క్రికెట్ స్టోర్ యజమాని నుంచి మూడు నాణ్యమైన బ్యాట్‌లను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా తిరిగి తన దేశానికి వెళ్లాడని పాక్ జర్నలిస్ట్ పేర్కొన్నాడు.
ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం వహించిన పాకిస్థాన్‌కు భారీ స్థాయిలో నష్టాలు వచ్చినట్లు నివేదికలు కూడా వచ్చాయి. అలాంటి సమయంలోనే ఇలాంటి వార్త రావడంతో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
దుకాణం యజమానికి ఇంకా డబ్బులు అందలేదు
ఈ పాకిస్థానీ ఆటగాడు బ్యాట్‌కు సంబంధించిన డబ్బును స్టోర్ యజమానికి ఇంకా చెల్లించలేదు. సీనియర్ పాకిస్థానీ జర్నలిస్ట్ వహీద్ ఖాన్ ప్రకారం.. స్టోర్ యజమాని పాకిస్తాన్ ఆటగాడిని సంప్రదించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. కానీ అతని కాల్స్, సందేశాలకు ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.
Also Read: PM Modi: శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
Sports journalist Waheed Khan reports Babar Azam bought three bats last year. He visited a New Jersey cricket store during the T20 World Cup. The store owner hasn't been paid, and the player is not returning calls. This situation is very embarrassing. pic.twitter.com/jk4bKGBs8V
— Madan Singh (@madansingh_Q) March 21, 2025
ఈ ఆటగాళ్లపై ప్రశ్నలు!
ఈ ఘటన వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికలపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, సామ్ అయూబ్, ఫఖర్ జమాన్ వంటి ఆటగాళ్లు ఆ పాకిస్థానీ జట్టులో ఉన్నారు. వారిలో ఒకరిని వహీద్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జరిగినప్పుడు చాలా మంది ప్రముఖ పాకిస్తానీ క్రికెటర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఆటగాళ్ల గురించి ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి. ఆటగాడు ఎవరనేఇ పూర్తిగా ధృవీకరించబడలేదు. ఈ వాదనలు నిజమని రుజువైతే అది పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రతిష్టకు మంచి సంకేతం కాదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే 2024 టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచిన విషయం తెలిసిందే.