Site icon HashtagU Telugu

Virat Kohli : కోహ్లీ…బ్రేక్ తీసుకో : రవిశాస్త్రి

Kohli Ravi Shastry

Kohli Ravi Shastry

టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్‌ చాలెంజర్స్‌ మాజీ సారథి విరాట్‌ కోహ్లి పేలవ ఆటతీరుతో అభిమానులను దారుణంగా నిరుత్సాహపరుస్తున్నాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌ ముగిసాక ఆర్సీబీ సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. జట్టులో కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, కిహ్లి కెప్టెన్సీ భారం లేనప్పటికీ బ్యాటర్‌గానూ దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 19.83 సగటుతో కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో తీవ్ర ఒత్తిడిలో సతమతమవుతున్న విరాట్ కోహ్లీకి ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరమని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

తాజాగా విరాట్ కోహ్లీ ఆటతీరుపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిందే. కోహ్లీల్లో ఇంకా 6-7 ఏళ్లపాటు క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇలాంటి తీవ్ర ఒత్తిడి మధ్య కోహ్లీని బరిలోకి దించి అతని కెరీర్‌ని నాశనం చేయకూడదు.. సోషల్ మీడియాకు కూడా కోహ్లీ వీడ్కోలు పలికి ప్రశాంతంగా గడపాలి. అసలు సమస్యేంటో గుర్తించి నూతనుత్సాహంతో తిరిగి మళ్ళీ రావాలి అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 214 మ్యాచ్చులాడిన విరాట్ కోహ్లి 6402 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.. అతని ఖాతాలో 5 సెంచరీలు, 42 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 23,650 పరుగులు సాధించిన కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు…. ఇక విరాట్ కోహ్లి చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్‌ మీద సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఇంతవరకు అతడు వంద పరుగుల మార్కును అందుకోలేకపోతున్నాడు.