Purple, Orange Caps: రాయల్స్ కే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్

రెండు నెలలకుపైగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ సందడి ముగిసింది.

  • Written By:
  • Updated On - May 30, 2022 / 03:27 PM IST

రెండు నెలలకుపైగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ సందడి ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. అరంగేట్రం చేసిన తొలి సీజన్ లోనే విజేతగా నిలిచింది. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అవార్డులు రెండు రాజస్థాన్ ప్లేయర్స్ కే దక్కాయి. ఆరెంజ్ క్యాప్ ను రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సొంతం చేసుకున్నాడు. సీజన్ ప్రారంభం నుంచీ తిరుగులేని ఫాంలో ఉన్న బట్లర్ నాలుగు శతకాలతో అదరగొట్టాడు. బట్లర్ మొత్తం
17 మ్యాచ్ ల్లో 863 రన్స్ చేశాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ రాజస్థాన్ టీమ్ నుండి బట్లర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

డేవిడ్‌ వార్నర్‌ను దాటిన బట్లర్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తొలి స్థానంలో కోహ్లి మూడో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌, నాలుగో స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ ఉండగా.. క్రిస్‌ గేల్‌, మైక్‌ హస్సీ ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. దీంతో ఈ సీజన్ లో ఆరంజ్ క్యాప్ దక్కించుకున్న బట్లర్ 10 లక్షల రూపాయల చెక్ కూడా అందుకున్నాడు.

మరోవైపు పుల్ క్యాప్ అవార్డ్ ను రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో అతడు7. 75 ఎకానమీ రేటుతో 27 వికెట్లు తీశాడు. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ గా ఇమ్రాన్ తాహిర్ 2019 రికార్డును చాహల్ సమం చేశాడు. చాహల్ తర్వాత స్థానంలో వహిందు హనరంగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందు చాహల్, హసరంగా ఇద్దరూ 26 వికెట్లతో సమానంగా ఉన్నారు. ఫైనల్ లో ఒక వికెట్ దక్కించుకున్న చాహల్ టాప్ ప్లేస్ కు చేరుకోవడంతో పర్పుల్ క్యాప్ తో పాటు పది లక్షల రూపాయల చెక్ కూడా అందుకున్నాడు