Site icon HashtagU Telugu

MI vs GT: గుజరాత్ లో “ఒకే ఒక్కడు”

Rashid Khan

gujarat titans

MI vs GT: గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. సూర్య కుమార్ అజేయ సెంచరీతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేయగలిగింది. మొదటి నుండి సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్ రేసులోకి వచ్చేసరికి సత్తా చాటుతుంది. వరుస ఓటములతో గాలి ఆడని పరిస్థితుల్లో ఉన్న రోహిత్ సేనకు తాజా విజయం మంచి బూస్ట్ ఇచ్చినట్టైంది. ఇక ప్రత్యర్థి ఆటగాడు రషీద్ ఖాన్ ఒంటరి పోరాటం వృధా అయింది.

ఐపీఎల్ 2023లో 57వ మ్యాచ్ వాంఖడే వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. గుజరాత్ తరఫున రషీద్ ఖాన్ అత్యధికంగా అజేయంగా 79 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా రషీద్‌పై ప్రశంసలు కురిపించాడు. మా జట్టు నుంచి రషీద్ మాత్రమే సరిగ్గా ఆడుతున్నాడని పాండ్యా అన్నాడు.

మ్యాచ్ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, “రషీద్ మాత్రమే మా జట్టుకు సరైన రీతిలో ఆడుతున్నట్లు అనిపించింది. అతను బ్యాట్ మరియు బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక మా ఇన్నింగ్స్ లో 25 పరుగులు అదనంగా ఇచ్చామని నేను భావించాను. నిజానికి మ్యాచ్ గెలుపుకు మేము చాలా దూరంగా ఉన్నామని, అయితే రషీద్ కారణంగా మా నెట్ రన్ రేట్‌ను కాపాడుకున్నామని హార్దిక్ అన్నారు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. సూర్యకుమార్ అజేయ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ అజేయంగా 79 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.

Read More: MI vs GT: సూర్యా భాయ్ వన్ మ్యాన్ షో… గుజరాత్ ను చిత్తు చేసిన ముంబై

Exit mobile version