Site icon HashtagU Telugu

IPL 2024: ఐపీఎల్ లో ఒక బంతి వేస్తే 7 లక్షలు

IPL 2024

IPL 2024

IPL 2024: క్యాష్ రిచ్ లీగ్ లో కాసుల వర్షం కురిపిస్తున్నారు ఆయా ఫ్రాంచైజీలు. స్టార్ ఆటగాళ్ల కోసం లక్షలాది రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. మొత్తం 14 మ్యాచ్ లకు గాను 20 కోట్లకు పైగానే వెచ్చిస్తున్నారు. ఏ ఏడాది జరిగిన మినీ వేలంలో కొందరు ఆటగాళ్లు కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించారు.

దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో నమోదైన రికార్డుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ఏడాది భారీ ధరకు అమ్ముడుపోయారు. మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించింది. పాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 14 మ్యాచ్‌లు ఆడుతాడు. మ్యాచ్ లో తన కోటాలో 4 ఓవర్లు వేస్తాడు. అంటే 336 బంతులు వేస్తాడు. ఈ లెక్కన ప్యాట్ కమిన్స్ కు ఒక బంతికి 6.1 లక్షలు చెల్లిస్తున్నారు. మరోవైపు కేకేఆర్ తరుపున మిచెల్ స్టార్క్ ఒక్కో మ్యాచ్ లో 4 ఓవర్లు వేస్తాడు. అంటే 336 బంతులు వేస్తాడు. దీంతో మిచెల్ స్టార్క్ ఒక బంతి వేస్తే దాని కాస్ట్ వచ్చేసి 7.40 లక్షలు. అంటే ఒక్క మ్యాచ్ ఆడినందుకు స్టార్క్ 1.7 కోట్లు తీసుకుంటాడు. ఒకవేళ కేకేఆర్ ఫైనల్స్‌కు చేరితే మిచెల్ స్టార్క్ గరిష్టంగా 17 మ్యాచ్‌లు ఆడుతాడు. అప్పుడు స్టార్క్ 408 బంతులు వేస్తాడు. ఇదే జరిగితే మిచెల్ స్టార్క్ వేసిన 1 బంతి ధర 6.1 లక్షలు.

Also Read: Nara Lokesh Arrest : నారా లోకేష్ ను అరెస్ట్ చేయబోతున్నారా..?

Exit mobile version