Rohit Sharma: సెలబ్రెటీల గురించి చాలా విషయాలు బయటకు రావు. ఎవరైనా బయటపెడితే కానీ ప్రపంచానికి తెలియవు. సెలబ్రెటీలు పాపులర్ అవ్వడం, జీవితంలో ఎదగడం వెనుక చాలా కష్టాలు ఉంటాయి. ఎంతో కష్టపడితే కానీ సెలబ్రెటీలుగా ఎదగలేరు. చిన్న వయస్సులో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉండి ఉంటారు. ఎవరూ ఈజీగా ఏ రంగంలోనూ రాణించలేదు. ఏ రంగంలోనైనా అయినా సరే రాణించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చిన్న వయస్సులో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో డబ్బుల కోసం చిన్నప్పుడు పాల ప్యాకెట్లు డెలివరీ చేసేవాడట. రోహిత్ శర్మతో కలిసి క్రికెట్ ఆడిన టీమిండియా మాజీ క్రికెటర్ ఓజా తాజాగా రోహిత్ శర్మ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలను బయటపడ్డారు. పాల ప్యాకెట్లు డెలివరీ చేయగా వచ్చిన డబ్బులో క్రికెట్ కిట్ కొనుక్కునేవాడని ఓజా చెప్పాడు. ఇవాళ రోహిత్ శర్మ ఉన్న పొజిషన్ చేస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పాడు.
రోహిత్ శర్మ యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాడని, అతడి నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరముందని ఓజా ప్రశంసలు కురిపించాడు. ఐదుసార్లు ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అని, ప్రస్తుతం టీమిండియాకు కూడా కెప్టెన్ గా అద్బుతంగా పనిచేస్తున్నాడని ఓజా చెప్పాడు. హిట్‌మ్యాన్ జర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మతో కలిసి ఓజా ఆడాడు. ఆ సమయంలో రోహిత్ శర్మతో ఓజా చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఒకరి కష్టాలను ఒకరు షేర్ చేసుకునేవారు.బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఇద్దరూ ఉండేవారు. దీంతో కెరీర్ ప్రారంభంలోనే రోహిత్ పడ్డ కష్టాలను తాజాగా ఓజా బయటపెట్టాడు. ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోహిత్ శర్మ చాలా గ్రేట్ అంటూ అభిమానులు అభినందిస్తున్నారు.