Site icon HashtagU Telugu

Dhoni Retirment Day: ఆగస్టు 15.. సాయంత్రం 7:29 నిమిషాలు – గుర్తుందా

Dhoni Retirment Day

New Web Story Copy 2023 08 15t143247.190

Dhoni Retirment Day: ఆగస్టు 15.. దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగితేలింది.అందరి నోట ఒకటే నినాదం వందేమాతరం, భారత్ మాతా కీ జై. సాయంత్రం ఖడ్గం సినిమా కోసం టీవీలకు అతుక్కుపోయారు. 2020, సమయం సాయంత్రం 7 గంటల 29 నిమిషాలు. అప్పుడే ఓ వార్త యావత్ ప్రపంచాన్నే షాక్ కు గురి చేసింది. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ధోనీ ఇంస్టాగ్రామ్ నుంచి ఓ పోస్ట్. క్షణాల్లో వైరల్ గా మారింది. క్రికెట్లో లెజెండ్స్ ఒక్కొక్కరూ ఆ పోస్ట్ కి రిప్లయ్ ఇస్తున్నారు. కానీ నమ్మాలా వద్దా అనే డైలమాలో ఫ్యాన్స్ ఉన్నారు. ఎం జరుగుతుందో అర్ధం కాలేదు. సరిగ్గా నిమిషాల వ్యవధిలో చిన తాలా సురైన్ రైనా రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్.

బెస్ట్ ఫ్రెండ్స్ గా, బ్రదర్స్ గా ఉండే ఈ ఇద్దరు లెజెండ్స్ క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పిన క్షణం ఎప్పటికి మర్చిపోలేం. వార్తలు చదువుతున్న ఎంతోమంది యాంకర్స్ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ వార్త చదివారు. దేశమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ధోనీ అనేది కేవలం పేరు మాత్రమే కాదు. ఆ పేరులోనే ఎదో ఎమోషన్ ఉంది. ఇండియాకి ప్రపంచ కప్ రాదన్న నోళ్ళు మూయించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి దేశాన్ని తలెత్తుకునేలా చేసిన ధీరుడు. అలాగే.. భారత జట్టును ఐసీసీ. ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలబెట్టిన లెజెండ్.

జులపాల జుట్టుతో క్రికెట్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన మాహీ, హెలికాఫ్టర్ షాట్ వంటి కొత్త కొత్త షాట్స్‌ని పరిచయం చేశాడు. కెప్టెన్‌గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా కనిపించే ధోనీని ఫ్యాన్స్ మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో.. సిక్సర్ కొట్టి భారత్‌కు వరల్డ్ కప్ అందించిన క్షణాలు భారత క్రికెట్ అభిమానుల కళ్లముందు కదులుతూనే ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్లో ధోని ఎంతటి కీర్తి గడించాడో.. అంతేస్థాయిలో ఐపీఎల్ లోనూ ప్రత్యేకతను చాటుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించి అయిదు ట్రోఫీలను అందించాడు. ధోనీ తన 15ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్ట్‌లు ఆడాడు. అలాగే సురేశ్‌ రైనా 14ఏళ్ల కెరీర్‌లో 226 వన్డేలు, 18 టెస్ట్‌లు, 200 ఐపీఎల్‌ మ్యాచులు, 78 టీ20లు ఆడాడు.

Also Read: CBN Slanderers : గ‌ద్ద‌ర్ పై కాల్పుల్లో నిజం ఇదే.!చంద్ర‌బాబుపై అప‌వాదులు.!