Site icon HashtagU Telugu

Whitehouse: చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు.. ఒకే ఓవర్ లో 6వికెట్లు?

Whitehouse

Whitehouse

మామూలుగా సినిమాలను అభిమానించే వారు ఎంతమంది ఉంటారో క్రికెట్ ను అభిమానించేవారు అంతకంటే ఎక్కువ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలామంది క్రికెట్ అంటే పిచ్చి ప్రాణం. ఆసక్తితో ఐపీఎల్, సాధారణ మ్యాచులను దగ్గరుండి ఒక్కసారైనా చూడాలని వీలైతే ఒకసారి అయినా గ్రౌండ్ లో ఆడాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. ఇందుకోసం చాలామంది రోజుల తరబడి గంటల తరబడి గ్రౌండ్ లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకే ఓవర్లో కంటిన్యూగా సిక్స్ లు కొట్టడం ఫోర్లు కొట్టి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

కానీ ఒకే ఓవర్ లో వరుసగా వికెట్లు తీయడం అన్నది చాలా అరుదు అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి అంటే క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు అలా ఎప్పుడూ జరగలేదని చెప్పవచ్చు. తాజాగా ఒక కుర్రాడు ఆ ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఒక జూనియర్‌ క్రికెటర్‌ ఒకే ఓవర్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలివర్ వైట్‌హౌజ్ అనే 12 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్‌లో 6 వికెట్లు పడగొట్టి సంచలనం నమోదు చేశాడు. ఒక క్రికెట్‌ టోర్నీలో బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైట్‌హౌజ్ కుక్‌హిల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

 

ఈ మ్యాచ్‌లో వైట్‌హౌజ్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీయడంతోపాటు రెండు ఓవర్లలో మొత్తం 8 వికెట్లు తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలి సారి. ఇక ఈ విషయాన్ని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ‍ట్వీట్‌ వైరల్‌ మారింది. కాగా వైట్‌హౌజ్ అమ్మమ్మ అయిన యాన్ జోన్స్ 1969లో వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ విశేషం.