ODI World Cup Schedule: ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్ (ODI World Cup Schedule)పై క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) షెడ్యూల్‌లో మార్పుల కోసం నిరంతరం డిమాండ్ చేస్తున్నందున అధికారిక షెడ్యూల్‌ను ఇప్పటి వరకు ఐసీసీ ప్రకటించలేదు. ఇప్పుడు దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారి ఒకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీసీసీఐ.. ఐసీసీకి పంపిన ముసాయిదా షెడ్యూల్‌లో రెండు మ్యాచ్‌ల వేదికను మార్చాలని పీసీబీ కోరింది. ఇందులో అహ్మదాబాద్ మైదానంలో కాకుండా మరో చోట చెన్నై గ్రౌండ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక మ్యాచ్ నిర్వహించాలని, భారత్‌తో మరో మ్యాచ్‌ను నిర్వహించాలనే డిమాండ్ వచ్చింది. దీనికి సంబంధించి బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ప్రకటనలో.. పీసీబీ ఏది కావాలంటే అది చెప్పగలదని అన్నారు. అయితే ఈ షెడ్యూల్ ఆలస్యానికి పాక్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంది. అంతకుముందు పాక్ అహ్మదాబాద్‌లో ఆడేందుకు సిద్ధంగా లేదు. ఇప్పుడు చెన్నైలో ఆడేందుకు సిద్ధంగా లేదు. పాక్ ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Australia Win: థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆసీస్ గెలుపు.. తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం
ఈ వారంలో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించవచ్చు
వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఈ వారంలో ఐసీసీ ప్రకటించవచ్చు. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం.. టోర్నమెంట్ అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో భారత జట్టు అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై మైదానంలో తన ప్రచారాన్ని ప్రారంభించవచ్చు.
ODI ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ లు నవంబర్ 15, 16 తేదీలలో జరిగే ఛాన్స్ ఉంది. టైటిల్ మ్యాచ్ నవంబర్ 19న జరగవచ్చు. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య చారిత్రాత్మక మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడతాయి.