పురుషుల వన్డే వరల్డ్ కప్ -2023 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగాటోర్నీకి సంబంధించిన మ్యాచ్‌ల షెడ్యూలను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. భారత్ జట్టు లీగ్ దశలో మొత్తం తొమ్మిది మ్యాచ్ ఆడనుండగా.. అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతుంది. చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. పది జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో 48 మ్యాచ్‌లు జరగనుండగా, భారత్‌లోని పది స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం కూడా ఉంది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి ఇందులో ఇండియా ఆడే మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. మూడు మ్యాచ్‌లలో రెండు పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్‌లే ఉన్నాయి.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం..
అక్టోబర్ 6న (శుక్ర) : పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్ -1
అక్టోబర్ 9న (సోమ) : న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్-1
అక్టోబర్ 12 (గురు) : పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-2
పాకిస్థాన్ ఆడబోయే రెండు మ్యాచ్‌లలో శ్రీలంక, జింబాబ్వే ప్రత్యర్థుగా ఉండే అవకాశం ఉంది.