ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు

క్రికెట్ ని భారతదేశంలో దైవంగా భావిస్తారు. మరే క్రీడకు లేని ఆదరణ ఒక్క క్రికెట్ కి మాత్రమే ఉంది. అందుకు తగ్గట్టే ఆటగాళ్లు చెలరేగిపోతాడు. అభిమానులకు కావాల్సిన మజాని అందిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంటారు.

ODI Double Centuries:క్రికెట్ ని భారతదేశంలో దైవంగా భావిస్తారు. మరే క్రీడకు లేని ఆదరణ ఒక్క క్రికెట్ కి మాత్రమే ఉంది. అందుకు తగ్గట్టే ఆటగాళ్లు చెలరేగిపోతాడు. అభిమానులకు కావాల్సిన మజాని అందిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంటారు. ప్రపంచ క్రికెట్లో టీమిండియాకు ఎదురు లేకుండా పోతుంది. రికార్డుల్లో మనోళ్లు సత్తా చాటుతున్నారు. వన్డేల్లో డబుల్ సెంచరీలతో పలు రికార్డుల్ని బద్దలు కొడుతున్నారు.

ఈ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో నిలబడి డబుల్ సెంచరీతో ఆసీస్ ని గట్టెకించాడు. 2010 లో సచిన్ టెండూల్కర్ మొదటి సారిగా వన్డే ల్లో డబుల్ సెంచరీ సాధించాడు.సౌతాఫ్రికా జట్టు మీద 200 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. వన్డేల్లో రోహిత్ మూడు సార్లు డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.ఈ ఘనత ఒక్క రోహిత్ కి మాత్రమే సాధ్యపడింది.అంతే కాదు వన్డే ల్లో వ్వ్యక్తిగత అతధిక స్కోర్ రోహిత్ ఖాతాలోనే ఉంది. 2014 లో శ్రీలంక మీద 264 పరుగులు చేసి మొదటి ప్లేస్ లో ఉన్నాడు రోహిత్. 2013 లో ఆస్ట్రేలియా మీద 209 పరుగులతో డబుల్ సెంచరీ కొట్టిన రోహిత్ 2017 లో శ్రీ లంక మీద 208 రన్స్ చేసి మరో డబుల్ సెంచరీ చేశాడు.

న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ 237 పరుగులు చేశాడు.వెస్ట్ ఇండీస్ మీద ఈ ఘనత అందుకున్నాడు.ఇక వీరేంద్ర సెహ్వాగ్ 2011 లో డబుల్ సెంచరీ చేశాడు.వెస్ట్ ఇండీస్ మీద 219 పరుగులు చేశాడు.అలాగే క్రిస్ గేల్ 2015 లో జింబాబ్వే మీద 215 పరుగులు చేశాడు.పకర్ జమాన్ 2018 లో జింబాబ్వే మీద 210 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా యువ ప్లేయర్స్ ఇషాన్ కిషన్ , శుభమన్ గిల్ కూడా డబుల్ సెంచరీలు చేశారు.ఇషాన్ కిషన్ 2022 లో బంగ్లాదేష్ మీద 210 పరుగులు కోట్టగ, గిల్ 2023లో న్యూజిలాండ్ మీద 208 పరుగులు చేశాడు.ఇపుడు తాజాగా ఆఫ్ఘన్ పై మ్యాక్సీ 201 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు.

Also Read: world cup 2023: ప్రపంచకప్‌ లో టాప్ 5 బౌలర్లు