Ind Vs WI: ఆరేసిన మెకాయ్…భారత్ ఓటమి

సొంత గడ్డపై వరుస పరాజయాలతో ఢీలా పడిన వెస్టిండీస్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. రెండో టీ ట్వంటీ లో భారత్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - August 2, 2022 / 11:02 AM IST

సొంత గడ్డపై వరుస పరాజయాలతో ఢీలా పడిన వెస్టిండీస్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. రెండో టీ ట్వంటీ లో భారత్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ బౌలర్ ఆరు వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు.
కరేబియన్ టూర్ లో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది.
తొలి టీ ట్వంటీలో సునాయాసంగా గెలిచిన భారత్.. రెండో మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. కరేబియన్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ ధాటికి భారత్ బ్యాటర్ల క్రీజులో నిలువలేక పోయారు.టాపార్డర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ 0, సూర్యకుమార్‌ 11, అయ్యర్‌ 10 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్‌ 12 బంతుల్లో 24 , హార్దిక్‌ పాండ్యా 31 బంతుల్లో 31 కాసేపు ఆదుకున్నారు. తర్వాత జడేజా 30 బంతుల్లో 27 రన్స్ చేశాడు. దీంతో భారత్ 138 పరుగులు చేయగలిగింది. మెకాయ్‌ 4 ఓవర్లలో 1 మెయిడెన్ చేసి 17 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

చేదనలో వెస్టిండీస్‌కి శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు 46 పరుగులు జోడించారు. నికోలస్ పూరన్, హెట్ మేయర్ నిరాశ పరిచినా… బ్రెండన్ కింగ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్ ఔటయ్యడు. అయితే 19వ ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చి విండీస్‌ బ్యాటర్లను అర్షదీప్‌ కట్టడి చేశాడు. దీంతో వెస్టిండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు కావాల్సి వచ్చాయి. ఓడియన్‌ స్మిత్‌ ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకొని సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత బంతికి ఫోర్‌ బాది విండీస్‌కు విజయాన్ని అందించాడు.దీంతో విండీస్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే టార్గెట్ ఛేదించింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్య, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.