T20 World Cup: సాకులు వెతుకుతున్న బంగ్లా.. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు..!

అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరిగిన భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ‘ఫేక్‌ ఫీల్డింగ్‌’ చేశాడని

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 12:09 PM IST

అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరిగిన భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ‘ఫేక్‌ ఫీల్డింగ్‌’ చేశాడని బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ నూరుల్‌ హసన్‌ సోహన్‌ ఆరోపించాడు. మ్యాచ్ 7వ ఓవర్‌లో ఓపెనర్లు లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో క్రీజులో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని ఆరోపణలు చేశాడు. ఈ ఘటన పూర్తిగా అంపైర్లు మరైస్ ఎరాస్మస్, క్రిస్ బ్రౌన్ దృష్టికి రాకపోవడం గమనార్హం. మ్యాచ్ తర్వాత నూరుల్ విలేకరులతో ఈ విధంగా చెప్పాడు.

విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ ఘటన ఏడో ఓవర్ లో జరిగింది. లిట్టన్ దాస్-నజ్ముల్ హెస్సెన్ శాంటో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతిని అర్ష్‌దీప్ సింగ్ డీప్ నుంచి వికెట్ కీపర్ కు బాల్ విసురుతాడు. మధ్యలో విరాట్ కోహ్లీ బంతిని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు విసురుతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఇద్దరు బ్యాటర్లు చూడలేదని, ఫేక్ ఫీల్డింగ్ అంటూ నూరుల్ విమర్శించాడు. ఐసీసీ రూల్ 41.5 ప్రకారం మోసగించడం, బ్యాటర్ ను అడ్డుకోవడాన్ని నిషేధిస్తుంది. దీనిని అంపైర్లు గుర్తిస్తే డెడ్ బాల్ గా ప్రకటించి ఐదు పెనాల్టీ పరుగులను ఇవ్వవచ్చు అని అన్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ ను 5 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ పరాజయాన్ని బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్లు జీర్ణించుకోలేక సాకులు వెతుకుతోందని టీమిండియా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.