Site icon HashtagU Telugu

Wimbledon Winner: జకోవిచ్ దే వింబుల్డన్

Novak

Novak

సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ అదరగొట్టాడు. కెరీర్ లో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జకోవిచ్ 6,6-3,6-4,7-6(7-3) తేడాతో కిర్గియోస్ పై విజయం సాధించాడు.
తొలిసారి గ్రాండ్​స్లామ్ ఫైనల్​​ ఆడిన కిర్గియోస్ వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్​ కు తొలి సెట్ లోనే షాక్ ఇచ్చాడు. అయితే మొదటి సెట్​లో ఓడినప్పటికీ ఒత్తిడికి ఏ మాత్రం వెనక్కి తగ్గని జకోవిచ్​.. రెండు, మూడు సెట్లలో గెలుపొందాడు.

అయితే నాలుగో సెట్​ హోరాహోరీగా సాగి టై అయింది. టై బ్రేకర్​లో పై చేయి సాధించిన జకోవిచ్​ ఏడో వింబుల్డన్​ టైటిల్​ సొంతం చేసుకున్నాడు. జకోవిచ్​ కెరీర్ లో ఇది 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్. తాజా గెలుపుతో అత్యధిక విజయాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫెదరర్​ను​ వెనక్కినెట్టాడు. రఫెల్​ నాదల్‌ 22 టైటిళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే అత్యధిక సార్లు వింబుల్డన్ గెలిచిన ఆటగాళ్ళ జాబితాలో సంప్రాస్ రికార్డును ఈ సెర్బియన్ స్టార్ సమం చేసాడు. 2018,2019,2021,2022లో వరుసగా నాలుగు వింబుల్డన్​ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ నిర్వహించ లేదు