Site icon HashtagU Telugu

Bumrah Injury: బుమ్రాకు స్ట్రెస్ రియాక్ష‌న్‌.. 6వారాలు విశ్రాంతి తీసుకుంటే చాలు..!

Jasprit Bumrah

Jasprit Bumrah

వెన్నుముక గాయం కార‌ణంగా టీ20 వ‌రల్డ్‌క‌ప్‌కు టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా దూర‌మైన విష‌యం తెలిసిందే. అయితే బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చ‌ర్ అయింద‌ని అనుకున్నాం. కానీ బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చ‌ర్ కాలేద‌ని.. స్ట్రెస్ రియాక్ష‌న్ అయింద‌ని తాజాగా బీసీసీఐ వెల్ల‌డించింది. అయితే తొలుత బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చ‌ర్ అయింద‌ని.. దాదాపు 4 నుంచి 6 నెల‌ల పాటు విశ్రాంతి తెలుసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కానీ బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చ‌ర్ కాలేద‌ని.. స్ట్రెస్ రియాక్ష‌న్ అయింద‌ని, 4 నుంచి 6 వారాలు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ తాజాగా ప్ర‌క‌టించింది.

ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్ 16 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బుమ్రాకు గాయం కావ‌టం టీమిండియాకు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. స‌ఫారీల‌తో మ్యాచ్‌ల అనంత‌రం టీమిండియా ఆసీస్ బ‌య‌లుదేర‌నున్న విష‌యం తెలిసిందే. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్య బృందం బుమ్రా స్కాన్ రిపోర్టుల‌ను ప‌రిశీలించింది. ఇది స్ట్రెస్ ఫ్రాక్చర్ కాదని, ‘స్ట్రెస్ రియాక్షన్’ అని వారు పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు బుమ్రా స్థానంలో హైద‌రాబాద్ బౌల‌ర్‌ మహ్మద్ సిరాజ్ వచ్చాడు. అయితే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బుమ్రా స్థానాన్ని భ‌ర్తీ చేసే బౌల‌ర్ కోసం టీమిండియా చూస్తోంది. ష‌మీ క‌రోనా నుంచి కోలుకున్నా ఇంకా ఫిట్ కాలేదు. ష‌మీ ప్ర‌స్తుతం జాతీయ క్రికెట్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందుతున్నాడు.