IPL 2025: హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఏ జట్టుకో తెలుసా ?

మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై ద్రవిడ్ తో ఫ్రాంచైజీ యాజమాన్యం చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అలాగే వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా సమావేశమైనట్టు జట్టు వర్గాలు తెలిపాయి. లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా రాజస్తాన్ టీమ్ డైరెక్టర్ గా కొనసాగనున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Ipl 2025, Rahul Dravid

Ipl 2025, Rahul Dravid

IPL 2025: టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ మళ్ళీ కోచ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ తో కోచ్ గా పదవీకాలం ముగిసిపోవడంతో ద్రావిడ్ తో ఒప్పందం కోసం పలు ఫ్రాంచైజీలు ప్రయత్నించాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు గట్టిగానే ట్రై చేశాయి. అయితే చివరికి తాను ప్రాతినిథ్యం వహించిన రాయల్స్ తోనే ద్రవిడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అధికారిక ప్రకటన రాకున్నా ఇప్పటికే డీల్ ఓకే అయినట్టు తెలుస్తోంది.

మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై ద్రవిడ్ తో ఫ్రాంచైజీ యాజమాన్యం చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అలాగే వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా సమావేశమైనట్టు జట్టు వర్గాలు తెలిపాయి. లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా రాజస్తాన్ టీమ్ డైరెక్టర్ గా కొనసాగనున్నాడు.

2012లో షేన్ వార్న్ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న ద్రవిడ్ మూడేళ్ళ పాటు సారథిగా ఉన్నాడు. ద్రవిడ్ సారథ్యంలో రాయల్స్ 2014 సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరింది. తర్వాత రెండు సీజన్లలో ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు మెంటార్ గా వ్యవహరించాడు. ఆ జట్టుతో ఒప్పందం ముగిసిన తర్వాత మిస్టర్ డిపెండబుల్ బీసీసీఐకి సేవలందించాడు. అండర్ 19, ఇండియా ఏ జట్లకు కోచ్ గానూ, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గానూ బాధ్యతలు చేపట్టాడు. అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్ గానూ ఉన్న ద్రావిడ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో ఘనంగా వీడ్కోలు పలికాడు.

Also Read: IPL 2025: మాతోనే సూర్యాభాయ్, మరో టీమ్ కు వెళ్ళడన్న ముంబై

  Last Updated: 04 Sep 2024, 11:26 PM IST