T20 World Cup: టి20 విజేత భారత్‌… ఏబీ డివిలియర్స్‌ జోస్యం

ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ను భారత జట్టు గెలుచుకుంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ జోస్యం చెప్పాడు.

Published By: HashtagU Telugu Desk
Villiers Imresizer

Villiers Imresizer

ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ను భారత జట్టు గెలుచుకుంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ జోస్యం చెప్పాడు. మెల్‌బోర్న్‌ స్టేడియంలో 13న జరిగే ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడే అవకాశం ఉందని ట్విట్టర్‌లో తెలిపాడు. ఆ ట్వీట్‌లో.. ‘టీమిండియాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ భీకరమైన ఫామ్‌కి తోడు కేఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రతిభను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కీలక సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రోహిత్‌ అదరగొడతాడు’ అని డివీలియర్స్‌ పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కచ్చితంగా సెమీఫైనల్‌ చేరతాయి అనుకున్నా.. నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి తమజట్టు ఇంటిదారి పట్టేందుకు కారణమైందని తెలిపాడు.

  Last Updated: 09 Nov 2022, 12:20 AM IST