Nora Fatehi: ముగింపు వేడుకల్లో అదరగొట్టిన నౌరా ఫతేహి

ఖతార్ వేదికగా జరిగిన సాకర్ ప్రపంచకప్ అభిమానులను ఉర్రూతలూగించింది.

Published By: HashtagU Telugu Desk
Nora Fatehi

Nora Fatehi

ఖతార్ వేదికగా జరిగిన సాకర్ ప్రపంచకప్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఫైనల్ కు ముందు ముగింపు వేడుకలను కూడా ఆతిథ్య దేశం అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి నౌరా ఫతేహి డాన్స్ క్లోజింగ్ సెర్మనీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

బాలీవుడ్ తో పాటు తెలుగులో పలు ఐటెమ్ సాంగ్స్ చేసి ఇక్కడి కుర్రాళ్లను తన అందచందాలతో కట్టిపడేసిన నోరా ఫతేహి తన స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్ లో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం నౌరా ఫతేహీ షో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె డాన్స్ ను ప్రశంసిస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. నౌరా ఫతేహీ రోర్ : టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్ చిత్రంతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో టెంపర్ లో ‘ఇట్టాగే రెచ్చిపోనా’, బాహుబలిలో మనోహరి, కిక్2 లో కిరుక్ కిక్ ఊపిరిలో డోర్ నెంబర్ పాటలలో మెరిసి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది.

బాలీవుడ్ లో ఆమె చేసిన డాన్స్ నెంబర్స్ అన్నీ యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫైనల్ కు ముందు జరిగిన ముగింపు వేడుకల్లో నౌరాతో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ గాయని రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ అభిమానులను అలరించారు.

https://twitter.com/iFaridoon/status/1604539232642805761

  Last Updated: 19 Dec 2022, 01:44 PM IST