Site icon HashtagU Telugu

Jadeja Counter to Kapil : మాకెవరికీ అహంకారం లేదు.. కపిల్ దేవ్ కామెంట్ల్స్ కు జడేజా కౌంటర్

None Of Us Have Pride.. Jadeja's Counter To Kapil Dev's Comments

None Of Us Have Pride.. Jadeja's Counter To Kapil Dev's Comments

Jadeja Counter to Kapil Dev Comments : వెస్టిండీస్ టూర్ లో రెండో వన్డే ఓటమి తర్వాత భారత జట్టుపై విమర్శలు వచ్చాయి. ఓటమి కంటే కూడా జట్టు మేనేజ్ మెంట్ చేస్తున్న ప్రయోగాలపైనే చాలా మంది మండిపడ్డారు. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కూడా జట్టులోని ఆటగాళ్ళపై తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. దేశం కంటే ఐపీఎల్ కే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శించాడు. చిన్న చిన్న గాయాలకే విశ్రాంతి తీసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశాడు. చాలా మందికి అహంకారం ఎక్కువైందంటూ పరోక్షంగా విమర్శలు చేశాడు. దీనిపై చర్చ నడస్తుండగా… తాజాగా భారత్ సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Jadeja) స్పందించాడు. కపిల్ దేవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. జట్టులో ఎవ్వరికీ అహంకారం లేదన్నాడు. తాము ఎప్పుడూ దేశం కోసమే ఆడతామన్నాడు.

జట్టులో ఎలాంటి మార్పులు చేసినా అది విజయం కోసమేనని. ఒక్కోసారి ఫలితాలు రాకుంటే ఏం కాదన్నాడు. మెగా టోర్నీ దృష్టిలో ఉంచుకునే ప్రయోగాలు చేస్తున్నామని చెప్పాడు. అన్నీ ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఎవ్వరూ స్పందించరనీ, కొన్ని సందర్భాల్లో మాత్రం మాట్లాడతారంటూ వ్యాఖ్యానించాడు. జట్టు కెప్టెన్ , కోచ్ లకు ఏం చేస్తున్నామనేది తెలుసన్నాడు. కపిల్ దేవ్ ఏమన్నారో తనకు తెలియదన్న జడేజా (Jadeja) ఎవరికైనా తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంటుందన్నాడు. జట్టులో అందరూ ఆటపైనే దృష్టి పెడతారని స్పష్టం చేశాడు. ఎవరూ దేనినీ పెద్దగా పట్టించుకోరనీ, ప్రతి క్రీడాకారుడు మైదానంలో 100 శాతం ప్రదర్శన ఇస్తాడన్నాడు.

జాతీయజట్టుకు ఎంపికైన ప్రతీ ప్లేయర్ పూర్తి స్థాయిప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తారనీ, ఎవరూ తనకు సునాయాసంగా అవకాశం వచ్చిందని భావించరన్నాడు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్ళకు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. జట్టులో ఏ ఒక్క ఆటగాడికీ గర్వం అనేది లేదని జడేజా (Jadeja) స్పష్టం చేశాడు. రెండో వన్డేలో విండీస్ పై ఓటమికి ప్రయోగాలే కారణమని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ లకు ఇలాంటి సమయంలో రెస్ట్ ఇవ్వడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ కు ముందు సీనియర్ ప్లేయర్స్ కు వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వాలే తప్ప ప్రయోగాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రపంచకప్ కోసం జట్టు కూర్పుపై పరిశీలినకే ప్రయోగాలు చేస్తున్నట్టు టీమిండియా మేనేజ్ మెంట్ చెబుతోంది.

Also Read:  TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు!