Site icon HashtagU Telugu

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు నిరాశ.. ఇంగ్లాండ్ పర్యటనకు నో చెప్పిన బీసీసీఐ!

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటన కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత్ ఎ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహించ‌నున్నాడు. ఈ జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)కు స్థానం దక్కలేదు. ఇది క్రికెట్ అభిమానుల‌కు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీసీసీఐ నిర్ణ‌యంతో అయ్య‌ర్‌ టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలనే క‌లకు కాస్త స‌మ‌యం పట్టేలా ఉంద‌ని తెలుస్తోంది. అతను తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను గత సంవత్సరం ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలో ఆడాడు.

ముంబై తరపున ఆడుతూ రంజీ ట్రోఫీలో అయ్య‌ర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. గత సీజన్‌లో కేవలం 7 ఇన్నింగ్స్‌లలో 68.57 అద్భుతమైన సగటుతో 480 పరుగులు చేశాడు. శ్రేయస్ వన్డేల్లో తనను తాను విశ్వసనీయ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో కూడా అలాంటి ప్రదర్శన చేస్తాడని ఆశించారు. కానీ అతన్ని మరోసారి సెలెక్ట‌ర్లు నిర్లక్ష్యం చేశారు.

అయ్యర్ పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు

అతను జట్టులో చోటు దక్కకపోవడానికి ఒక కారణం అతనికి విశ్రాంతి ఇవ్వడం కావచ్చు. అయ్య‌ర్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత అతను ఐపీఎల్ 2025లో పాల్గొన్నాడు. ప్ర‌స్తుతం అయ్య‌ర్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్న‌ పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం ప్లేఆఫ్ రేసులో ఉంది. అయినప్పటికీ బీసీసీఐ రెండవ మ్యాచ్ కోసం శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లను జట్టులో చేర్చింది. దీన్ని బట్టి చూస్తే అతనికి కూడా జట్టులో అవకాశం ఇవ్వాల్సింది.

Also Read: Rohit Sharma Angry: రోహిత్ శ‌ర్మ‌కు కోపం వ‌స్తే ఎలా ఉంటుందో చూస్తారా? వీడియో వైర‌ల్‌!

గైక్వాడ్‌కు స్థానం

బీసీసీఐ ఈ 20 మంది సభ్యుల జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం కల్పించింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే గైక్వాడ్ ఐపీఎల్ 2025 సమయంలో ఫ్రాక్చర్ కారణంగా మధ్యలోనే బయటకు వెళ్లవలసి వచ్చింది. అతను ఈ సీజన్‌లో కేవలం 3 రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో 330 పరుగులు చేశాడు.