Site icon HashtagU Telugu

Sri Lanka Tour: సెప్టెంబ‌ర్ వ‌ర‌కు క్రికెట్‌కు దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయ‌ర్స్‌..!

Jasprit Bumrah

Jasprit Bumrah

Sri Lanka Tour: భారత్-జింబాబ్వే మధ్య ఐదు టీ20ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో బీసీసీఐ కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఇప్ప‌టికే టీమిండియా.. జింబాబ్వేతో 2 మ్యాచ్‌లు ఆడగా, 1 మ్యాచ్‌లో గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడిపోయింది. టీం ఇండియా ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అనంత‌రం భార‌త్ జ‌ట్టు శ్రీలంక పర్యటనకు (Sri Lanka Tour) వెళ్లనుంది. అక్కడ జూలై 27 నుండి టీం ఇండియా శ్రీలంకతో 3 T20, 3 ODI మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ సిరీస్‌లో కూడా బీసీసీఐ తన సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

శ్రీలంక పర్యటనలో భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు అంటే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చేలా ఉంది. ఈ టూర్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా లేదా కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వం వ‌హించనున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇదే సమయంలో యువ ఆటగాళ్లతో పాటు కొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కూడా జట్టులోకి తీసుకోవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా సెప్టెంబర్ నుండి టీమ్ ఇండియాలో ఆడే అవ‌కాశం ఉంది. దీని తర్వాత వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా క‌స‌రత్తులు ప్రారంభించ‌నుంది.

Also Read: Usha Uthup Husband: ప్ర‌ముఖ గాయ‌ని ఇంట్లో విషాదం.. గుండెపోటుతో భ‌ర్త మృతి

వీరికి అవ‌కాశం..?

రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా లేదా కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. దీంతో పాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకుంటే అభిషేక్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, రితురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ వంటి ఆటగాళ్లకు జట్టులో అవకాశం ద‌క్కే ఛాన్స్‌లున్నాయి.

కొత్త కోచ్‌తో బ‌రిలోకి..!

శ్రీలంకతో సిరీస్‌లో భారత జట్టు కొత్త కోచ్‌తో రంగంలోకి దిగనుంది. టీమిండియా కోచ్ బాధ్యతలను మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ప్రస్తుత జింబాబ్వే టూర్‌కు టీం ఇండియా కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ నియమితులయ్యారు. టీమ్ ఇండియా కొత్త కోచ్‌తో ఆడేందుకు శ్రీలంక వెళ్తుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ఇటీవలే చెప్పారు. ఇక‌పోతే భార‌త్ జ‌ట్టు శ్రీలంక‌తో జూలై 27 నుంచి ఆగ‌స్టు 7 వ‌రకు మ్యాచ్‌లు ఆడ‌నుంది.

We’re now on WhatsApp : Click to Join