Site icon HashtagU Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీ లేకుండానే 2024 టీ20 ప్రపంచకప్‌ కు టీమిండియా..!?

Virat Kohli Record

Virat Kohli Record

Virat Kohli: ప్రపంచ కప్ 2023 నుండి భారత క్రికెట్ జట్టులోని ఇద్దరు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మల భవిష్యత్తుపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కాగా గురువారం బీసీసీఐ అధికారులు, జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, ఐదుగురు సెలక్టర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును ఎంపిక చేశారు. విరాట్‌, రోహిత్‌ల భవిష్యత్తు, టీ20 ప్రపంచకప్‌ కెప్టెన్సీపై కూడా నిర్ణయం తీసుకున్నారు.

2023 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అయినప్పటికీ టైటిల్ గెలవలేకపోయారు. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇప్పుడు T20 ప్రపంచ కప్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇటీవల సమావేశం జరిగింది. ఒక నివేదిక ప్రకారం.. బోర్డు T20 జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఉంచనున్నట్లు సమాచారం. కానీ విరాట్ కోహ్లీకి టీ20 జట్టులో స్థానం లేదు. దీనిపై బోర్డు కోహ్లీతో కూడా మాట్లాడనున్నట్లు సమాచారం.

Also Read: India vs Australia: నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..?!

అభిషేక్ త్రిపాఠి ఎక్స్ పోస్ట్ ప్రకారం.. బీసీసీఐ అధికారులు సమావేశం నిర్వహించారు. ఐదుగురు సెలక్టర్లతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. తదుపరి ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లను జట్టులో ఉంచేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు రోహిత్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేయాలని కోరుతున్నారు. కానీ శుభ్‌మన్, యశస్వి కారణంగా విరాట్ కోహ్లీకి చోటు దక్కదని రాసుకొచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సమావేశంలో టీమిండియా భవిష్యత్తుపై చర్చ జరిగింది. ఇందులో రోహిత్‌తో ఓపెనింగ్‌కు యశస్వి, శుభ్‌మన్‌లకు ప్రాధాన్యత లభించింది. ఇషాన్‌ కిషన్‌ను 3వ స్థానంలో నిలిపేందుకు ప్లాన్‌ ఉంది. అందుకే విరాట్ కోహ్లి టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. కోహ్లి అనుభవజ్ఞుడైన ఆటగాడు, ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా రాణించాడు. అయితే ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో జట్టును మార్చేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది.

వన్డే, టీ20 ఫార్మాట్‌ల నుండి విరామం తీసుకోవాలని విరాట్ కోహ్లీ ఇటీవల బీసీసీఐని అభ్యర్థించాడని తెలిసిందే. ఈ కారణంగానే దక్షిణాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి కోహ్లీకి విరామం లభించింది. టెస్టు జట్టులో కోహ్లీకి చోటు కల్పించారు. రోహిత్ శర్మ కూడా టీ20, వన్డే సిరీస్‌ల నుంచి విరామం తీసుకున్నాడు.