Women 1st T20I : మ్యూజిక్ , హంగామా వద్దు… క్వీన్ ఎలిజిబెత్ మృతితో భారత్,ఇంగ్లాండ్ నిర్ణయం…!!

క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో అక్కడ జరుగుతున్న చాలా కార్యక్రమాలకు బ్రేక్ పడింది.

  • Written By:
  • Updated On - September 11, 2022 / 12:17 AM IST

క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో అక్కడ జరుగుతున్న చాలా కార్యక్రమాలకు బ్రేక్ పడింది. క్రికెట్ మ్యాచ్ లను కూడా ఒకరోజు పాటు నిలిపివేశారు. తిరిగి శనివారమే మళ్ళీ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం భారత్ మహిళల క్రికెట్ జట్టు, ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య తొలి టీ ట్వంటీ జరగనుంది.

చెస్టర్ లీ మైదానం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు ముందు నిర్వాహకులు రెండు జట్లకూ పలు సూచనలు చేశారు. క్వీన్ ఎలిజిబెత్ మృతి , సంతాప దినాల నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఎటువంటి సంగీతం వినిపించాకూడదని సూచించారు. అలాగే కమర్షియల్ ఈవెంట్స్ కూడా ఉండవన్నారు. స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించినప్పటకీ.. ఎక్కువ హంగామా లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అయితే మైదానంలో వికెట్ తీసినప్పుడు, మ్యాచ్ గెలిచిన తర్వాత క్రికెటర్ల జోష్ పై ఎటువంటి ఆంక్షలు విధించలేదు.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు జట్లలో ఎవరు గెలిచినా పెద్ద హడావుడి కనిపించే అవకాశం లేదు. క్వీన్ ఎలిజిబెత్ మృతితో రెండు జట్ల క్రికెటర్లూ ముందు రెండు నిమిషాలు మౌనం పాటించనున్నారు. ఇదిలా ఉంటే మూడు టీ20 మ్యాచుల సిరీస్ కోసం భారత మహిళల జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ లో గత కొంతకాలంగా భారత అమ్మాయిల జట్టు మెరుగ్గా రాణిస్తున్నా ఫినిషింగ్ లోపాలను అధిగమించలేకపోతోంది.

దీంతో ఈ సిరీస్ లో వాటిని సరిచేసుకోవాలని భావిస్తోంది. కాగా కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత అమ్మాయిలు రజత పతకంతో సరిపెట్టుకున్నారు. అయితే షార్ట్ ఫార్మేట్ కావడంతో ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలుస్తామని భారత మహిళల జట్టు కాన్ఫిడెంట్ గా ఉంది.