Ind Vs Eng: సీరీస్ సమమే టార్గెట్ గా ఇంగ్లాండ్ జట్టు ఎంపిక

గత ఏడాది కరోనా కారణంగా భారత్ తో టెస్ట్ సీరీస్ లో వాయిదా పడిన చివరి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 07:10 PM IST

గత ఏడాది కరోనా కారణంగా భారత్ తో టెస్ట్ సీరీస్ లో వాయిదా పడిన చివరి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. సీరీస్ లో 1-2 తో వెనుకబడిన ఇంగ్లాండ్ దానిని సమం చేయడమే లక్ష్యంగా జట్టును ఎంపిక చేశారు. 15 మంది సభ్యుల జాబితాలో న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌కు దూరమైన సీనియర్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌తోపాటు వికెట్‌కీపర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ను కూడా ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌కు ముందు కొవిడ్‌ బారిన పడిన బెన్‌ ఫోక్స్‌కు బ్యాకప్‌గా బిల్లింగ్స్‌ను ఎంపిక చేయగా.. అతన్ని ఈ టీమ్‌లోనూ కొనసాగించారు. ఆండర్సన్‌ టెస్టుల్లో 650 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ఒకే వికెట్‌ దూరంలో ఉన్నాడు. అతడు తన చిరకాల పేస్‌బౌలింగ్‌ పార్ట్‌నర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌తో కలిసి బౌలింగ్‌ చేసే అవకాశం ఉంది. గతేడాది ఇంగ్లండ్‌పై టీమిండియా పైచేయి సాధించినా.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రెండు జట్ల కెప్టెన్లు, కోచ్‌లు మారిపోవడంతోపాటు ఇంగ్లండ్‌ ఆటతీరు ఎంతో మెరుగైంది. కివీస్ తో మూడు టెస్టుల సిరీస్ ను ఇంగ్లీష్ టీమ్ క్లీన్ స్వీప్ చేసింది. మూడు మ్యాచ్ ల్లోనూ టీ ట్వంటీ తరహాలో టార్గెట్స్ చేదించింది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ జో రూట్ , జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.

ఇంగ్లాండ్ జట్టు :
బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జేమ్స్‌ ఆండర్సన్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌, సామ్‌ బిల్లింగ్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, హారీ బ్రూక్‌, జాక్‌ క్రాలీ, బెన్‌ ఫోక్స్‌, జాక్‌ లీచ్‌, అలెక్స్‌ లీస్‌, క్రెయిగ్‌ ఓవర్టన్‌, జేమీ ఓవర్టన్‌, మాథ్యూ పాట్స్‌, ఓలీ పోప్‌