Site icon HashtagU Telugu

Rohit- Kohli Retirement: కోహ్లీ, రోహిత్ రిటైర్ కాబోతున్నారా? గిల్ ఏమ‌న్నాడంటే!

Rohit- Kohli Retirement

Rohit- Kohli Retirement

Rohit- Kohli Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా పూర్తిగా సిద్ధమైంది. కాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్‌పై (Rohit- Kohli Retirement) గిల్ పెద్ద ప్రకటన ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు ఉన్నాయి. కాగా.. ఈ ఇద్దరు గొప్ప ఆటగాళ్ల రిటైర్మెంట్ గురించి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించడం లేదని జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శనివారం అన్నారు. ఒకవేళ టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిస్తే రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లి రిటైరయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రోహిత్, కోహ్లీ గురించి ఇలా అన్నాడు

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ రూమ్‌లో రిటైర్మెంట్ గురించి ప్రస్తుతం ఎలాంటి చర్చ లేదు. నేను భాగమైన అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఇదే. ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ ఒకడు. విరాట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా జట్టు బ్యాటింగ్ బాగుంది. టాప్ ఆర్డర్ స్వేచ్ఛతో బ్యాటింగ్ చేయడానికి అవ‌కాశం ఉందని గిల్ చెప్పాడు.

Also Read: CM Chandrababu: ఉమెన్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు కీల‌క‌ ప్రకటన

‘ఈసారి విజయం సాధిస్తాం’

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ను గెలుస్తానని గిల్ నమ్మకంగా ఉన్నాడు. ఫైనల్ కోసం మేమంతా ఉత్సాహంగా ఉన్నాం. గత సారి 50 ఓవర్ల ప్రపంచకప్ గెలవలేకపోయాం. కానీ ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నామ‌ని అన్నాడు. ఫైనల్ మ్యాచ్ గురించి గిల్ మాట్లాడుతూ.. పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడి ఉంటుంది. అయితే ఒత్తిడిని ఏ జట్టు తట్టుకోగలిగితే ఆ జట్టు ఫైనల్‌లో విజయం సాధిస్తుంది. మేము దీన్ని ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే పరిగణించాలి. మంచి జట్లు అలాగే చేస్తాయి. మేము ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు ఆడాం. మంచి ప్రదర్శన చేశాం కాబట్టి మాపై అదనపు ఒత్తిడి లేదని గిల్ ధీమా వ్య‌క్తం చేశాడు. ఇక‌పోతే ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ- 2025 ఫైన‌ల్ మ్యాచ్ మార్చి 9వ తేదీన జ‌ర‌గ‌నుంది. ట్రోఫీలోని చివ‌రి మ్యాచ్ కోసం టీమిండియా, కివీస్ ఇప్ప‌టికే త‌మ వ్యూహాల‌ను రచించాయి.