Mustafizur Rahman: భారత్- బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సంబంధాలు అంత ఆశాజనకంగా లేవు. ఈ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలోనే కేకేఆర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. అయితే గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారడంతో రెహమాన్‌ను ఐపీఎల్ ఆడకుండా నిషేధించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
రెహమాన్‌పై నిషేధం ఉంటుందా?
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం భారత్ వ్యతిరేక నినాదాలు వినిపిస్తుండటంతో భారత ప్రజలు కూడా దానికి దీటుగా స్పందించాలని కోరుకుంటున్నారు. దీనివల్ల ముస్తాఫిజుర్ రెహమాన్‌పై నిషేధం విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇన్‌సైడ్ స్పోర్ట్ ప్రతినిధితో మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఇది చాలా సున్నితమైన పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలి. మారుతున్న దౌత్య పరిస్థితులపై మేము నిరంతరం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము. బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. కాబట్టి, ముస్తాఫిజుర్ ఐపీఎల్‌లో ఆడతారు. బంగ్లాదేశ్ మనకు శత్రు దేశం ఏమీ కాదు” అని సదరు అధికారి స్పష్టం చేశారు.
Also Read: 2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్.. న్యూ ఇయర్‌కు తొలుత స్వాగతం పలికిన దేశం ఇదే!
ఐపీఎల్‌లో రెహమాన్ ట్రాక్ రికార్డ్
ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ రెహమాన్‌కు మంచి రికార్డు ఉంది. అందుకే అతడి కోసం కేకేఆర్ భారీగా వెచ్చించింది.
మ్యాచ్‌లు: 60
వికెట్లు: 65 (సగటు 28.45)
ఎకానమీ: 8.13 ముఖ్యంగా డెత్ ఓవర్లలో రెహమాన్ వేసే స్లో డెలివరీలు జట్టుకు కీలకం. అందుకే కేకేఆర్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.
కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగులుతుందా?
రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత క్లిష్టంగా మారితే అది కేకేఆర్ జట్టు సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ రెహమాన్‌పై నిషేధం విధిస్తే అది కేకేఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ప్రస్తుతం కేకేఆర్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. తన నాలుగో ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. జట్టు యజమాని షారుఖ్ ఖాన్ కూడా పరిస్థితులు సద్దుమణగాలని కోరుకుంటున్నారు.
