Site icon HashtagU Telugu

Nitish Reddy: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ న్యూస్.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

Nitish Reddy

Nitish Reddy

Nitish Reddy: గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే టైటిల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వారి కలను బద్దలు కొట్టింది. ఈసారి పాట్ కమిన్స్ కెప్టెన్సీలో జట్టు చూపు ట్రోఫీపైనే ఉంది. ఐపీఎల్ 2025 ప్రారంభం కాకముందే హైదరాబాద్ జట్టుకు శుభవార్త వచ్చింది. స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Reddy) గాయం నుంచి కోలుకుని జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరేందుకు నితీష్ రెడ్డి సిద్ధం

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. IPL 2025లో తన జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. సైడ్ స్ట్రెయిన్ సమస్య కారణంగా అతను జనవరి నుండి ఏ మ్యాచ్ ఆడలేకపోయాడు. PTI ప్రకారం.. నితీష్ భారత క్రికెట్ బోర్డు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో యో-యో టెస్ట్‌తో సహా అన్ని ఫిట్‌నెస్ పరీక్షలలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. తిరిగి మైదానంలోకి వెళ్లేందుకు ఫిజియో అనుమతి కూడా వ‌చ్చింది.

Also Read: Sundar Pichai: క్రికెటర్ కావాలని కలలు కన్నాడు.. కానీ ఇప్పుడు రోజుకు రూ. 6.67 కోట్లు సంపాద‌న‌!

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడ్డాడు

21 ఏళ్ల నితీష్ రెడ్డి జనవరి 22న ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు.అయితే ఈ మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అతను చెన్నైలో రెండో T20 ఇంటర్నేషనల్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండఆ.. సైడ్ స్ట్రెయిన్ సమస్య కారణంగా మొత్తం ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్‌లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఐపీఎల్ 2024లో మంచి ప్రదర్శన చేశాడు

గతేడాది ఐపీఎల్ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6 కోట్లకు నితీష్ రెడ్డిని తన వద్ద ఉంచుకుంది. గత సీజన్‌లో అతను 13 మ్యాచ్‌ల్లో 143 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. భారత్ ఆస్ట్రేలియా పర్యటనలోనూ నితీశ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 114 పరుగులతో సాహసోపేతమైన ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నితీష్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. త్వరలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరనున్నాడు. అతని జట్టు మార్చి 23న హైదరాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది.