Nitish Father Falls On Gavaskar Feet: సునీల్ గవాస్కర్‌ కాళ్ళు మొక్కిన నితీష్ కుటుంబం

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 114 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నితీష్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అతని ఇన్నింగ్స్‌ను అందరూ కొనియాడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Nitish Father Falls On Gavaskar Feet

Nitish Father Falls On Gavaskar Feet

Nitish Father Falls On Gavaskar Feet: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించి అద్భుతం చేశాడు. అతని సెంచరీ యావత్ దేశం గర్వించేలా చేసింది. మెల్‌బోర్న్ స్టేడియంలో ఉన్న అతని కుటుంబం చాలా భావోద్వేగానికి గురైంది. దీని తరువాత నితీష్ తండ్రి అనుభవజ్ఞుడైన సునీల్ గవాస్కర్ పాదాలను (Nitish Father Falls On Gavaskar Feet) తాకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 114 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నితీష్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అతని ఇన్నింగ్స్‌ను అందరూ కొనియాడుతున్నారు. అదే సమయంలో ఉద్యోగం వదిలేసి కొడుకుని క్రికెటర్‌ని చేసిన తండ్రి త్యాగాన్ని స్మరించుకుంటున్నారు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ అనంతరం తండ్రి ముత్యాలయ్య రెడ్డి చాలా ఉద్వేగభరితంగా కనిపించాడు. స్టేడియంలోనే ఏడ్చేశాడు. మ్యాచ్ అనంతరం వెటరన్ సునీల్ గవాస్కర్‌ను కలవడానికి వెళ్లిన ముత్యాలరెడ్డి గవాస్కర్ పాదాలను తాకి అభిమానాన్ని చాటుకున్నాడు. తండ్రి ముత్యాలయ్య మాత్రమే కాకుండా తల్లి, ఆయనతో పాటు వచ్చిన నితీష్ సోదరి కూడా గవాస్కర్ పాదాలను తాకారు. నితీష్ రెడ్డి కుటుంబంతో భేటీ సందర్భంగా సునీల్ గవాస్కర్ నితీష్ బ్యాటింగ్ గురించి మాట్లాడారు. నితీష్ ఒక వజ్రమని కొనియాడాడు.

Also Read: India vs Australia: మెల్‌బోర్న్‌ టెస్టుకు భారీ సంఖ్యలో అభిమానులు

నితీష్ కుమార్ రెడ్డి ఆటతీరుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రివార్డు ప్రకటించింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. ‘ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ఇది చాలా మంచి రోజు, సంతోషకరమైన తరుణం. టెస్ట్ క్రికెట్ మరియు టి-20 అంతర్జాతీయ క్రికెట్‌కు భారత జట్టులో ఆంధ్రాకు చెందిన ఆటగాడు ఎంపిక కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనతకు గౌరవ సూచకంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నితీష్ కుమార్ రెడ్డికి రూ.25 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనుంది.

 

  Last Updated: 30 Dec 2024, 12:33 AM IST