మెల్ బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy ) భారీ సెంచరీతో హెడ్ లైన్స్ లో నిలిచాడు. మెల్ బోర్న్ పిచ్ పై కెప్టెన్ రోహిత్, కోహ్లి, పంత్, జడేజా, రాహుల్ ఇలా అందరూ ఫ్లాప్ కాగా వాషింగ్టన్ సుందర్ తో కలిసి నితీష్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పెర్త్ టెస్ట్‌లో తన టెస్ట్ అరంగేట్రం క్యాప్ తర్వాత నితీష్ మూడు సార్లు హాఫ్ సెంచరీ చేరువలో అవుట్ అయ్యాడు. ఒక అరంగేట్రం ఆటగాడికి అది ఎంత విలువైన ఇన్నింగ్స్లో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సారి ఆ తప్పిదం చేయకపోగా కెరీర్లో తొలి శతకం బాదేశాడు.
మెల్‌బోర్న్‌లో నితీష్ అద్భుత ప్రదర్శన తర్వాత అతని నికర విలువ ఎంతో తెలుసుకోవాలని అభిమానులు గూగుల్ ని ఆశ్రయిస్తున్నారు. మరి నితీష్ గురించి మరింత తెలుసుకుందాం. నితీష్ కుమార్ రెడ్డి నికర విలువ రూ 8 నుండి 15 కోట్ల మధ్య ఉంటుంది. 2025 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీష్‌ను 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇది కాకుండా నితీష్ మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో అతనిపేరు చేరింది. సి-గ్రేడ్‌లో చేర్చడంతో నితీష్ కు కోటి రూపాయలు అందుతోంది.
Read Also : Nitish Kumar Reddy : నితీష్ రెడ్డి పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
నితీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించాడు. నితీష్ 5 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. అతని ఎడ్యూకేషన్ వివరాలు చూస్తే.. నితీష్ బిటెక్ పూర్తి చేశాడు. బిజినెస్ అనలిటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి తల్లిదండ్రులు, ఒక సోదరి ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డికి ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ తన బేస్ ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 303 పరుగులు చేసిన నితీష్,3 వికెట్లు పడగొట్టాడు. 2021 సంవత్సరంలో, ఇండోర్‌లో విదర్భ జట్టుపై లిస్ట్-ఎ క్రికెట్‌లో నితీష్ రెడ్డి తన మొదటి అర్ధ సెంచరీని సాధించాడు. 58 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని ఇన్నింగ్స్‌లో 2 సిక్స్‌లు మరియు 5 ఫోర్లు ఉన్నాయి. అతని ఇన్నింగ్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ జట్టు 332 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. నితీష్ కుమార్ రెడ్డి బైక్‌లంటే అమితంగా ఇష్టపడతాడు. అతని వద్ద BMW G 310 GS మరియు Jawa 42 బైకులు ఉన్నాయి. వాటి ధర రూ. 3.86 మరియు రూ. 2.32 లక్షలు.
Read Also : Elgandal Fort : ఎల్గండల్ కోట ను డెవలప్ చెయ్యండి అంటూ స్మిత సబర్వాల్ కు నెటిజన్ ట్వీట్