Nitish Kumar Reddy: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి (Nitish Kumar Reddy)ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. తన మాజీ ప్లేయర్ ఏజెన్సీ ‘స్క్వేర్ ది వన్’ అతనిపై రూ. 5 కోట్లకు పైగా బకాయిల కేసు నమోదు చేసింది. ఈ పరిణామం నితీష్ రెడ్డికి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే అతను సిరీస్ మధ్యలో గాయపడి జట్టు నుంచి వైదొలిగాడు.
నితీష్ రెడ్డిపై బకాయిల కేసు వివరాలు
రిపోర్ట్స్ ప్రకారం.. నితీష్ రెడ్డి తన మాజీ ప్లేయర్ ఏజెన్సీ స్క్వేర్ ది వన్‌కు రూ. 5 కోట్లకు పైగా బకాయిపడి ఉన్నాడని ఆ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో నితీష్ రెడ్డికి ‘స్క్వేర్ ది వన్’ మధ్య ఒప్పందం ముగిసినట్లు సమాచారం.
‘మధ్యవర్తిత్వం- రాజీ చట్టం’లోని సెక్షన్ 11(6) కింద ప్లేయర్ ఏజెన్సీ ‘స్క్వేర్ ది వన్’ తరపున ఈ కేసు నమోదు చేసింది. నితీష్ రెడ్డిపై మేనేజ్‌మెంట్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, బకాయి మొత్తాన్ని చెల్లించకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణ జూలై 28న ఢిల్లీ హైకోర్టులో జరగనుంది. ఈ ఏజెన్సీ నితీష్ రెడ్డితో సుమారు 4 సంవత్సరాల పాటు పనిచేసింది.
Also Read: Harish Rao: ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే భయమెందుకు రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి నితీష్ రెడ్డి దూరం
నితీష్ రెడ్డికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ సిరీస్‌లో అతని బ్యాట్ నుంచి తొలి టెస్ట్ సెంచరీ కూడా నమోదైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం కూడా అతను జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో నితీష్ మొదటి 3 మ్యాచ్‌లు ఆడాడు. కానీ అతని ప్రదర్శన ఆశించినంతగా లేదు. మూడవ టెస్ట్ మ్యాచ్ సమయంలో నితీష్ రెడ్డికి గాయం అయింది. దీని కారణంగా అతను నాల్గవ, ఐదవ టెస్ట్‌లకు దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్ట్‌లో నితీష్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడుతున్నాడు.