Site icon HashtagU Telugu

CWG 2022 : మరోసారి సత్తాచాటిన తెలంగాణ బిడ్డ….భారత్ కు మరో స్వర్ణం..!!

Nikhat

Nikhat Imresizer (1)

కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. ఆదివారం భారత్ కు పతకాల వర్షం కురుస్తోంది. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న విమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం సొంతం చేసుకుంది. ఐర్లాండ్ బాక్సర్ కార్లి మెక్నాల్ తో తలపడిన నిఖత్ జరీన్ తన పంచ్ తో మట్టికరిపించింది.

దీంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. అంతకుముందు కేరళకు చెందిన 25సంవత్సరాల జంపర్ ఎల్దోస్ పాల్ మెన్స్ ట్రిపుల్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర క్రియేట్ చేశాడు.