Site icon HashtagU Telugu

NIkhat Zareen: లాస్ట్ పంచ్ మనదే..!వరల్డ్ బాక్సింగ్ విజేత తెలంగాణ బిడ్డ..!!

Nikhat

Nikhat

మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీత్ నిలిచింది. గురువారం రాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్ లో నిఖత్ విజయం సాధించింది. థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ ను చిత్తుచేసిన నిఖత్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ విజేతగా నిలిచింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భాగంగా హైదరాబాదీ యువ బాక్సర్ 52కిలోల విభాగంలో సత్తా చాటి…తన జోరును ఫైనల్ మ్యాచ్ లోనూ కొనసాగించింది. ఫైనల్లో జిట్ పాంగ్ పై పంచ్ ల వర్షం కురిపించింది.

లాస్ట్ పంచ్ కూడా తనదేనన్నట్లుగా చెలరేగింది నిఖత్. జిట్ పాంగ్ ను ఏకంగా 5-0తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన నిఖత్ స్వర్ణ పతాకాన్ని సాధించి 52 కిలోల విభాగంలో వరల్డ బాక్సింగ్ విజేతగా చరిత్ర క్రియేట్ చేసింది.