Site icon HashtagU Telugu

Abu Dhabi T10: టీ10 లీగ్ లో విండీస్ మాజీ కెప్టెన్ విధ్వంసం

Nicholas Pooran

Nicholas Pooran

కెప్టెన్సీ పోయిందన్న కసితో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్ టీ 10 లీగ్ లో రెచ్చిపోయాడు. దక్కన్‌ గ్లాడియేటర్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న నికోలస్‌ పూరన్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 77 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచాడు. అతడితో పాటు ఓడియన్‌ స్మిత్‌ 23 పరుగులతో రాణించాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు రోజే వెస్టిండీస్‌ కెప్టెన్సీకి పూరన్‌ గుడ్ బై చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అటు ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పూరన్ ను మినీ వేలానికి ముందు వదిలేసింది. ఈ కసితో మరింత రెచ్చిపోయిన విండీస్ వికెట్ కీపర్ తన బ్యాటింగ్ సత్తా రుజువు చేశాడని కరేబియన్ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా ఈ మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో టీమ్ అబుధాబి పై గ్లాడియేటర్స్ విజయం సాధించింది. 135 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది.

Exit mobile version