RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో నికోలస్ పూరన్ సిక్సర్ల వర్షం

చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.

RCB vs LSG: చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. జట్టు తరఫున క్వింటన్ డి కాక్ 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, నికోలస్ పూరన్ కేవలం 21 బంతుల్లో 40 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానంలో నికోలస్ పూరన్ తుఫాను బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. చివరి రెండు ఓవర్లలో పురన్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు.190 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ కేవలం 21 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేశాడు.

మార్కస్ స్టోయినిస్ పెవిలియన్ బాట పట్టిన తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ నెమ్మదిగా ఆరంభించాడు. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో పూరన్ విధ్వంసం సృష్టించాడు. రీస్ టాప్లీ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. టోప్లీ వేసిన ఓవర్లో మొత్తం 20 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత చివరి ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో నికోలస్ పూరన్ 21 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేశాడు.

We’re now on WhatsAppClick to Join

ఇక ఇన్నింగ్స్ లో డికాక్ మెరిశాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన క్వింటన్ డికాక్.. ఆరంభం నుంచే అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. రీస్ టాప్లీ వేసిన తొలి ఓవర్‌లోనే డికాక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్‌లో డికాక్ మహ్మద్ సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. డికాక్ మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 81 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో డికాక్ 8 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు.

Also Read; Rohit Sharma: ముంబైకి కెప్టెన్ గా రోహిత్ రావాల్సిందే: తివారి