Site icon HashtagU Telugu

Nicholas Pooran :విండీస్ కెప్టెన్ గా సన్‌రైజర్స్ పవర్ హిట్టర్

Nicholas Pooran

Nicholas Pooran

వెస్టిండీస్ జట్టు సారథి కీరన్‌ పొలార్డ్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా పోలార్డ్ స్థానంలో ఆ జట్టు యువ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నికోలస్‌ పూరన్‌ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్‌ 2022తో పాటు, 2023 వన్డే వరల్డ్ కప్‌ ముగిసే వరకు వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక నికోలస్ పూరన్‌ 2016లో వెస్టిండీస్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయగా.. ఇప్పటివరకు 37 వన్డేల్లో 1,121 పరుగులు, 57 టీ ట్వంటీల్లో 1193 పరుగులు సాధించాడు.

వన్డేల్లో ఒక సెంచరీ, 8 ఆఫ్ సెంచరీలు ఉండగా.. టీ ట్వంటీల్లో 8 ఆఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న నికోలస్ పూరన్‌ను సన్ రైజర్స్ హైదరాబద్ ఫ్రాంచైజీ మెగావేలంలో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. పంజాబ్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ భారీ మొత్తం అతడి కోసం ఖర్చు చేసింది. అయితే భారీ అంచనాల మధ్య ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరన్ విధ్వంసకర ఆటతీరుతో దుమ్మురేపుతున్నాడు. తాజాగా పూరన్‌కు వెస్టిండీస్ కెప్టెన్‌గా అవకాశం రావడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.