అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి గ్రెగ్ బార్‌క్లే నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో బార్‌క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ళ పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే 2020లో తొలిసారిగా ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. ఈ సారి రేసులో బీసీసీఐ నుంచి రేసులో పలువురి పేర్లు వినిపించాయి. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పోటీ పడతారని , దాదాపుగా దాదా ఎన్నిక ఖాయమన్న ప్రచారం కూడా వినిపించింది. అయితే బీసీసీఐ మాత్రం గంగూలీ పేరును ప్రతిపాదించలేదు.
అటు సెక్రటరీ జైషా పేరును సైతం బోర్డు ప్రతిపాదించకపోవడంతో గ్లెగ్ బార్ క్లే ఏకగ్రీవం ఖాయమని తేలిపోయింది. కాగా జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులానీ కూడా పోటీ చేసినప్పటకీ చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బార్ క్లే వరుసగా రెండోసారి ఐసీసీ బాస్‌గా వ్యవహరించేందుకు లైన్ క్లియరైంది. గ్రెగ్‌కు బీసీసీఐతో సహా 17 మంది ఐసీసీ సభ్యులు మద్ధతిచ్చారు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో మంచి అనుభవం ఉన్న గ్రెగ్ బార్‌క్లే గతంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే 2015లో ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ డైరెక్టర్‌గానూ పనిచేశారు.