world cup 2023: న్యూజిలాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక

ప్రపంచకప్ లో శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న లంక ఈ రోజు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దారుణంగా విఫలం చెందింది.శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన లంక చేతులెత్తేసింది.

world cup 2023:  ప్రపంచకప్ లో శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న లంక ఈ రోజు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దారుణంగా విఫలం చెందింది.శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన లంక చేతులెత్తేసింది. ఆరంభం నుంచి కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో లంక టాపార్డర్ పెవిలియన్ కి క్యూ కట్టింది. నిస్సాంక 2, , కుశాల్ మెండిస్ 7 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 6 పరుగులు చేశాడు. సదీర సమరవిక్రమ (1). న్యూజిలాండ్ బౌలర్ల ధాటిగా బౌలింగ్ చేస్తుండటంతో శ్రీలంక పవర్‌ప్లేలో సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. అయితే లంకను గాడిన పెట్టె ప్రయత్నం చేసిన కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. ఇరు జట్ల గత రికార్డుల్ని పరిశీలిస్తే..న్యూజిలాండ్, శ్రీలంక మధ్య ఇప్పటి వరకు మొత్తం 101 వన్డేలు జరిగాయి. న్యూజిలాండ్ 51 గెలిస్తే.. లంక 41 మ్యాచ్ లు గెలిచింది. ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 11 మ్యాచ్‌లు జరిగితే శ్రీలంక 6, న్యూజిలాండ్ 5 గెలిచింది.

Also Read: KTR: ఆర్మూర్ రోడ్ షోలో ఆపశృతి, మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదం