Site icon HashtagU Telugu

New Zealand: సెమీస్ కు చేరువైన న్యూజిలాండ్.. కీలక మ్యాచ్ లో శ్రీలంకపై విజయం

New Zealand

New Zealand Imresizer

New Zealand: వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ (New Zealand) సెమీఫైనల్ కు మరింత చేరువైంది. మిగిలిన ఒక బెర్త్ కోసం మూడు జట్లు రేసులో ఉండగా.. కీలక మ్యాచ్ లో కివీస్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ కివీస్ సమిష్టిగా రాణించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లంక ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది.

కివీస్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆరంభం నుంచే తడబడుతూ సాగిన లంక కేవలం 171 పరుగులకే కుప్పకూలింది. ఒక దశలో 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఆరంభంలో కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో చివర్లో మహీశ్ తీక్షణ 38 నాటౌట్ , మధుశనక విలువైన పార్టనర్ షిప్ తో కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఫెర్గూసన్ 2, మిచెల్ సాంట్నర్ 2, రచిన్ రవీంద్ర 2 వికెట్లు పడగొట్టారు.

Also Read: Shubman Gill-Sara: గిల్ పై సారా ట్వీట్.. కానీ ట్విస్ట్

సెమీస్ రేసులో నిలవాలంటే రన్ రేట్ పెంచుకోవాల్సి ఉండడంతో న్యూజిలాండ్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, కాన్వే తొలి వికెట్ కు 12.2 ఓవర్లలో 86 పరుగులు జోడించారు. కాన్వే 45, రవీంద్ర 42 పరుగులు చేయగా.. తర్వాత మిఛెల్ 43 పరుగులతో చెలరేగాడు. చివర్లో వికెట్లు కోల్పోయినప్పటకీ.. గ్లెన్ ఫిలిప్స్, లాథమ్ కివీస్ విజయాన్ని పూర్తి చేశారు. చివరికి న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో కివీస్ సెమీస్ అవకాశాలు బాగా మెరుగయ్యాయి. తాజా గెలుపుతో ఆ జట్టు రన్ రేట్ మరింత పెరిగింది. ఈ మ్యాచ్ తర్వాత పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు సెమీస్ చేరాలంటే ఇంగ్లాండ్ ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.