Site icon HashtagU Telugu

world cup 2023: న్యూజిలాండ్ భారీ టార్గెట్.. పాక్ తడబాటు

World Cup 2023 (77)

World Cup 2023 (77)

world cup 2023: బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకుంటున్నాయి. టాస్ గెలిచి పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా కివీస్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కివీస్ ఆటగాళ్లు ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించారు. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర సెంచరీతో కదం తొక్కగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ 95 పరుగులతో పాక్ బౌలర్లను ఉతికారేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర జోడీ మరోసారి 50కి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించగా, కాన్వే 35 పరుగులు చేసి ఔటయ్యాడు.ఇక రీ ఎంట్రీ ఇచ్చిన కేన్ విలియమ్సన్.రచిన్ రవీంద్రతో కలిసి 180 పరుగులు జోడించాడు. దీంతో రచిన్ 108 పరుగులతో ఈ ప్రపంచకప్ లో మూడో సెంచరీ నమోదు చేశాడు. కేన్ విలియమ్సన్ 95 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. డెర్రీ మిచెల్ 18 బంతుల్లో 29 పరుగులు , మార్క్ చాప్మన్ 27 బంతుల్లో 39, గ్లెన్ ఫిలిప్స్ 25 బంతుల్లో 41, మిచెల్ సాంట్నర్ 17 బంతుల్లో 26 పరుగులతో స్కోర్ బోర్డును పెంచడంలో సహాయపడ్డారు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ జూనియర్ 3 వికెట్లు తీయగా, హరీస్ రౌఫ్ 1, ఇఫ్తికర్ అహ్మద్ 1, హసన్ అలీ 1 వికెట్లు తీసుకున్నారు.

402 భారీ పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాక్ ఆరంభంలో బిగ్ వికెట్ కోల్పోయింది. పాకిస్థాన్ ఓపెన‌ర్ అబ్దుల్లా షఫీక్ 6 పరుగులకే అవుట్ అయ్యాడు.

Also Read: Rs.25 Onion Price : కిలో ఉల్లి రూ.25కే..కేంద్రం ప్రకటన