Site icon HashtagU Telugu

Virat Kohli: కోహ్లీపై కన్నేసిన మహిళ క్రికెటర్

Xara Jetly Virat Kohli

Xara Jetly Virat Kohli

Virat Kohli: ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విరాట్‌ కోహ్లీకి కోట్లలో అభిమానులున్నారు. అందులో కొందరు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు రిచర్డ్ కోహ్లీకి వీరాభిమాని. రిచర్డ్ గతంలో ఈ విషయాన్నీ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఆ స్థాయి వ్యక్తి కోహ్లీకి అభిమాని కావడం కోహ్లీ ప్రతిభను తెలియజేస్తుంది.

విదేశీ క్రికెటర్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్ ని అంటూ, కోహ్లీకి బౌలింగ్ కూడా చేయాలనీ ఉందంటూ సంచలన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మహిళ క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూజిలాండ్ యువ స్పిన్నర్ జరా జెట్లీ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అభిమానుల జాబితాలో చేరింది. 22 ఏళ్ల జారా కోహ్లిపై తన కోరికను బయటపెట్టింది. జరా పాడ్‌కాస్ట్‌లో తాను కోహ్లీకి బౌలింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పింది.. త్వరలో కోహ్లీని కలిసి అతనితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తానని చెప్పింది.

ఉమెన్స్ సూపర్ స్మాష్ చివరి సీజన్‌లో వెల్లింగ్టన్‌ని గెలవడంలో జారా కీలక పాత్ర పోషించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన ఫైనల్‌లో బ్లేజ్ 1 పరుగు తేడాతో కాంటర్‌బరీని ఓడించింది. జరా 10 మ్యాచ్‌ల్లో 5.59 ఎకానమీ రేటుతో 9 వికెట్లు పడగొట్టింది. కాగా దేశ‌వాళీలో రాణిస్తున్న జెట్లీ వీలైనంత త్వరగా జాతీయ జ‌ట్టులో చోటు దక్కించుకోవాలని ఎదురు చూస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె 11 మ్యాచుల్లో 3.71 ఎకాన‌మీతో 17 వికెట్లు ప‌డ‌గొట్టింది.

Also Read: CM Chandrababu: డిప్యూటీ సీఎం శాఖపై చంద్రబాబు సమీక్ష, పవన్ వివరణ