Site icon HashtagU Telugu

Neil Wagner: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్‌..!

Neil Wagner

Safeimagekit Resized Img 11zon

Neil Wagner: ఇటీవల న్యూజిలాండ్ జట్టు తమ సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ (Neil Wagner) అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఇప్పుడు తన 12 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు.

nzc.nz నివేదిక ప్రకారం.. వెటరన్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో తన చివరి మ్యాచ్ ఆడనున్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్ వెల్లింగ్‌టన్‌లో, రెండో మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది.

We’re now on WhatsApp : Click to Join

తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ వాగ్నర్ ఇలా పేర్కొన్నాడు. బ్లాక్‌క్యాప్‌ల కోసం టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. కివీస్ జ‌ట్టుకు ఆడినందుకు గర్వపడుతున్నాను అన్నాడు. నా కెరీర్‌లో ఏర్పడిన స్నేహాలు, బంధాలను నేను ఎంతో ఆదరిస్తాను. ఈ రోజు నేను ఉన్న స్థితికి చేరుకోవడంలో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అన్నారు. నేను ఎల్లప్పుడూ జట్టు కోసం ఉత్తమమైనదాన్ని చేయాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చారు.

Also Read: Mohammed Shami: ష‌మీ కాలికి శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతం.. సోష‌ల్ మీడియాలో ఫోటోలు..!

కాగా 2012లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కివీస్‌ తరపున అరంగేట్రం చేసిన వాగ్నర్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నాడు. వాగ్నర్‌ కేవలం టెస్టుల్లో మాత్రమే న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 64 టెస్టులు ఆడిన 37 ఏళ్ల వాగ్నర్‌.. 260 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో కివీస్‌ బౌలర్‌గా వాగ్నర్‌ కొనసాగుతున్నాడు.

నీల్ వాగ్నర్ క్రికెట్ కెరీర్

నీల్ వాగ్నర్ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున 64 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో వాగ్నర్ 260 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా నీల్ వాగ్నర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 205 మ్యాచ్‌ల్లో 821 వికెట్లు పడగొట్టాడు. వాగ్నర్ 86 టీ20 మ్యాచుల్లో 95 వికెట్లు పడగొట్టాడు.