Virat Kohli: విరాట్ కోహ్లీ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బ్యాటర్లలో ఒకరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే 28 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆయన తాజాగా న్యూజిలాండ్‌తో వడోదరలో జరుగుతున్న మొదటి వన్డేలో మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో 42 పరుగులు పూర్తి చేయగానే శ్రీలంక దిగ్గజ బ్యాటర్ కుమార సంగక్కరను వెనక్కి నెట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు.
ప్రపంచ రికార్డు వివరాలు
కుమార సంగక్కర తన 666 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్‌లో 28,016 పరుగులు చేశారు. ఇన్నాళ్లూ ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఆయన పేరిట ఉన్న రికార్డును కోహ్లీ ఈరోజు తుడిచిపెట్టారు.
నెంబర్ 1: సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు).
నెంబర్ 2: విరాట్ కోహ్లీ (కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే సంగక్కరను దాటేశారు). విశేషమేమిటంటే సచిన్, సంగక్కర కంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు టాప్-2 స్థానాల్లో భారత క్రికెట్ దిగ్గజాలే ఉండటం గమనార్హం.
Also Read: మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే!
THE GREATEST EVER – KING KOHLI 😍 pic.twitter.com/hM5t24r5Tb
— Johns. (@CricCrazyJohns) January 11, 2026
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన తర్వాత కూడా కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశారు. విరాట్ కోహ్లీకి ఇది వరుసగా ఐదవ సారి 50+ స్కోరు కావడం విశేషం. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 94 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేయడంతో టీమ్ ఇండియాకు ఈ లక్ష్య ఛేదన సులభంగా మారుతోంది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్, విరాట్ కోహ్లీ ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు
- సచిన్ టెండూల్కర్- 34,357
- విరాట్ కోహ్లీ- 28,017*
- కుమార సంగక్కర- 28,016
- రికీ పాంటింగ్- 27,483
- మహేల జయవర్ధనే- 25,957
