Slow Over Rule: స్లో ఓవర్‌రేట్‌కు చెక్ పెట్టేందుకు ఐసీసీ కీలక నిర్ణయం

సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓటమిపాలైంది. అయినప్పటికీ భారత జట్టు ప్రదర్శనకు అన్ని స్థాయిల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాల్సి

Slow Over Rule: సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓటమిపాలైంది. అయినప్పటికీ భారత జట్టు ప్రదర్శనకు అన్ని స్థాయిల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాల్సి రావడంతో క్రికెటర్లు, క్రికెట్ అభిమానుల్లో కొంత నిరాశ వ్యక్తమైనా.. ఈ టోర్నీలో భారత జట్టు ప్రదర్శనపై అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్ అవుట్’ చర్చకు దారి తీసింది. అదేవిధంగా ఐసీసీ అమలు చేయనున్న మరో నిబంధనపై చర్చ మొదలైంది. స్లో ఓవర్‌రేట్‌కు చెక్ పెట్టేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

బౌలింగ్ జట్టు ఒక ఓవర్ ముగిసిన వెంటనే.. 60 సెకన్‌లలోపు మరో ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో రెండుసార్లు అంపైర్ నుంచి వార్నింగ్ ఉంటుంది. మూడోసారి కూడా అలానే జరిగితే.. ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీని విధిస్తారు. అంటే బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు 5 పరుగులు లభిస్తాయి. ఓవర్‌కు ఓవర్‌కు మధ్య టైమ్ గ్యాప్‌ను చెక్ చేసేందుకు స్టాప్‌ వాచ్‌లు వాడనున్నారు.=

ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో స్టాప్ క్లాక్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ నియమం డిసెంబర్ 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు ఐదు నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయబడుతుంది. ఈ వ్యవధిలో ఈ నియమం ప్రభావాన్నిఐసీసీ సమీక్షిస్తుంది.ఈ ఐదు నెలల్లో ఐసీసీ నిర్వహించే పురుషుల వన్డే, టీ20 మ్యాచ్‌లకు ఈ నిబంధన వర్తించనుంది.

Also Read: Imphal Missile Destroyer : శత్రువుల మిస్సైల్స్‌‌ మటాష్.. సముద్రంలో ఇండియా తడాఖా