Site icon HashtagU Telugu

New National Cricket Academy: టీమిండియా ఆట‌గాళ్ల కోసం కొత్త జాతీయ క్రికెట్ అకాడ‌మీ సిద్దం.. ఫొటోలు వైర‌ల్‌!

New National Cricket Academy

New National Cricket Academy

New National Cricket Academy: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జై షా ఓ కీల‌క ప్రకటన చేశారు. భారత ఆటగాళ్ల కోసం కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (New National Cricket Academy) దాదాపు సిద్ధమైందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇది ప్రపంచ స్థాయి సౌకర్యాన్ని కలిగి ఉంటుందన్నారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటే వర్షంలోనూ ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఇందుకోసం ఇండోర్ పిచ్‌ను సిద్ధం చేశారు. దీనితో పాటు మరెన్నో పెద్ద సౌకర్యాలు కల్పించనున్నారు.

ఈ మేర‌కు జై షా Xలో పోస్ట్‌‌ను భాగస్వామ్యం చేశారు. ఇందులో అతను కొత్త క్రికెట్ అకాడమీకి సంబంధించిన అనేక చిత్రాలను పంచుకున్నాడు. జై షా క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు. BCCI కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ దాదాపు సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బెంగళూరులో త్వరలో ప్రారంభించనున్నాం. కొత్త క్రికెట్ అకాడమీలో మూడు ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో 45 పిచ్‌లు ఉన్నాయి. ఇండోర్ క్రికెట్ పిచ్, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, రికవరీ- స్పోర్ట్స్ సైన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Also Read: Himachal Rains: రాబోయే 4 రోజులు కీలకం, 114 రోడ్లు మూసివేత

BCCI పాత క్రికెట్ అకాడమీ కూడా బెంగళూరులోరు ఉంది. కొత్తది కూడా ఇక్కడే నిర్మించారు. అందులో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంచారు. దీనితో పాటు అత్యాధునిక శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రం ఉంది. టీమిండియా ఆటగాడు ఎవరైనా గాయపడితే కోలుకోవడానికి చాలా ఏర్పాట్లు ఉన్నాయి. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై మరింత మెరుగైన శ్ర‌ద్ధ చూప‌నున్నారు. టీమ్ ఇండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ చాలా మంచి చర్యలు తీసుకుందని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. ఇందులో న్యూ నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్ణయం ముఖ్యమైనది అంటున్నారు. వర్షంలో కూడా ఆటగాళ్లు ఇక్కడ క్రికెట్ ఆడవచ్చు. ఇందుకోసం ఇండోర్ పిచ్‌లను సిద్ధం చేశారు. ఇక్కడ ఆటగాళ్లు వర్షంలో కూడా ప్రాక్టీస్ చేయగలరు.

We’re now on WhatsApp. Click to Join.

ప్ర‌స్తుతం టీమిండియా శ్రీలంక‌లో ప‌ర్య‌టిస్తుంది. మూడు వ‌న్డేల సిరీస్ ఆడుతోంది. శుక్ర‌వారం జ‌రిగిన తొలి వ‌న్డేలో మ్యాచ్ టై అయింది. ఆగ‌స్టు 4న రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని ఇరుజ‌ట్లు ప‌ట్టుద‌లతో ఉన్నాయి. వ‌న్డే సిరీస్‌కు ముందు జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే.