Matthew Hayden: రోహిత్ ఎప్పుడూ అంతే… మాథ్యూ హెడెన్

ఐపీఎల్ ఫైనల్ కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ నేటితో ముగియనుంది.

Matthew Hayden: ఐపీఎల్ ఫైనల్ కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ నేటితో ముగియనుంది. పది జట్లతో మొదలైన ఈ సీజన్ ఐపీఎల్ లో చివరికి రెండు జట్లు మాత్రమే మిగిలాయి. హార్దిక పాండ్య సారధ్యంలో గుజరాత్ టైటాన్స్, మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ నేడు తలపడనున్నాయి. ఈ రోజు మ్యాచ్ అనంతరం ఐపీఎల్ 2023 టైటిల్ విన్నర్ ఎవరో తేలనుంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాట్స్ మెన్ మాథ్యూ హెడెన్ టీమిండియా రోహిత్ శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2023 క్వాలిఫయర్2 లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ భారీ పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ని చిత్తు చేసింది. దీంతో రోహిత్ సేన ఇంటి బాట పట్టగా.. పాండ్య సేన ఫైనల్ లో ఆడేందుకు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఈ సీజన్లో రోహిత్ ప్రదర్శన ఆకట్టుకోలేకపోయింది. రోహిత్ బ్యాట్ నుంచి జట్టుకు అవసరమయ్యే పరుగులే రాలేదు. కీలక మ్యాచ్ లోను రోహిత్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 332 పరుగులు మాత్రమే చేశాడు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రోహిత్ కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ రోహిత్ ప్రదర్శనపై హాట్ కామెంట్స్ చేశాడు.

Hayden

కీలక మ్యాచ్‌ల్లో విఫలం కావడం రోహిత్ శర్మకు ఇదేం కొత్త కాదు. టీమిండియా ముంబై ఇండియన్స్ ఫార్మేట్ ఏదైనా కావొచ్చు.. జట్టుకు అవసరమైన సమయంలో రోహిత్ పరుగులు చేయడం నేనెప్పుడూ చూడలేదు. అతడొక ఫెయిల్యూర్. ఈ సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడంలో రోహిత్ పాత్ర శూన్యం. జట్టులోని ఆటగాళ్ల కష్టంతోనే రోహిత్ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. అందులో అతడి ఘనతేం లేదని హెడెన్ రోహిత్ పై హాట్ కామెంట్స్ చేశాడు.

Read More: IPL Final: కౌన్ బనేగా ఛాంపియన్.. టైటిల్ పోరుకు గుజరాత్, చెన్నై రెడీ..!