Yuzvendra Chahal: శ్రీలంకతో టీ20, వన్డేలకు ప్రకటించిన జట్టులో అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. శ్రీలంక సిరీస్ కు సెలెక్ట్ కాకపోవడంతో యుజ్వేంద్ర చాహల్ కెరీర్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాహల్ క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనని కొందరు విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు.ఇటీవల ముగిసిన ట20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన చాహల్ కు టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం కల్పించలేదు.దీనికి ముందు ఆసియా కప్ మరియు వన్డే ప్రపంచ కప్‌లో లో అతనికి చుక్కెదురైంది.
టీ20 ప్రపంచకప్ తర్వాత కొత్త కోచ్ గంభీర్ సారథ్యంలో భారత జట్టు కొత్త తరహాలో తయారవుతోంది. సీనియర్లను వాడుకుంటూనే జూనియర్లకు శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలో చాహల్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 33 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ వన్డే, టీ20ల్లో భారత జట్టుకు తన సేవలను అందించాడు. విశేషమేంటంటే యఙవేంద్ర చాహల్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఒకవేళ గంభీర్ వేటు వేస్తే చాహల్ ను మళ్ళీ బ్లు జర్సీలో చూడకపోవచ్చు.
ప్రస్తుతం చాహల్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లెగ్ స్పిన్నర్ గత ఐపీఎల్ లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. యుజ్వేంద్ర చాహల్ 2013లో ఐపీఎల్ డెబ్యూ చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. అనూహ్యంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులోనే 200 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. 72 వన్డేల్లో అతని పేరిట 121 వికెట్లు ఉన్నాయి. చాహల్ తన చివరి వన్డేను 2023 జనవరిలో మరియు చివరి టి20 ఆగస్టు 2023లో ఆడాడు.
Also Read: Elon Musk On Microsoft: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ పై ఎలాన్ మస్క్ ట్రోలింగ్