Site icon HashtagU Telugu

world cup 2023: నెద‌ర్లాండ్స్ మ‌రో సంచ‌లనం.. బంగ్లాదేశ్ పై ఘ‌న విజ‌యం

World Cup 2023 (62)

World Cup 2023 (62)

world cup 2023: వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే సౌతాఫ్రికాని ఓడించి టోర్నీలో సంచలనం రేపి .. తాజాగా బాంగ్లాదేశ్ కు షాకిచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి 142 పరుగులకు ఆలౌటైంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (89 బంతుల్లో 68* 6 ఫోర్లు) . వెస్లీ బరేసి 41, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 35, లోగాన్ వాన్ బీక్ 23 ప‌రుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ ష‌కీబ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. దీనికి సమాధానంగా బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ నలుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లా బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ టైటిల్ రేసులో కొనసాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించింది.

నెదర్లాండ్స్1996లో మొదటి ప్రపంచ కప్‌ను ఆడింది. దీని తర్వాత 2003, 2007 మరియు 2011 ప్రపంచ కప్‌లను కూడా ఆడింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మ్యాచ్‌లో 27 ఏళ్ల ఎడ్వర్డ్స్ నెదర్లాండ్స్ తరఫున వన్డే క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను 44 మ్యాచ్‌ల్లో 15 అర్ధ సెంచరీలు సాధించాడు.

Also Read: Israel Hamas War: భయంకరంగా మారిన ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం