T20 వరల్డ్ కప్ పెను సంచలనంతో ఆరంభమైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ టోర్నీ రెండో మ్యాచ్ లో యూఏఈ (United Arab Emirates)పై నెదర్లాండ్స్ విజయం సాధించింది. 2వ మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠగా సాగింది. 3 వికెట్ల తేడాతో యూఏఈపై నెదర్లాండ్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటింగ్ లో ఓపెనర్ వసీం (41) పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్సమెన్ ఎవరు 20 పరుగులు కూడా చేయలేకపోయారు. నెదర్లాండ్స్ బౌలింగ్ లో బాస్ డి లీడే 3 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫ్రెడ్ క్లాస్సన్ 2 వికెట్లు, వాన్ డెర్ మెర్వే, టిమ్ ప్రింగిల్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్ లో ఓపెనర్లు Max ఒదౌడ్ (23),విక్రంజిత్ సింగ్ (10) పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఏ బ్యాట్సమెన్ మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపు నెదర్లాండ్స్ ను వరించింది. యూఏఈ బౌలింగ్ లో జునైద్ సిద్దిక్యూ 3 వికెట్లు తీశాడు.