Asian Games 2023: నీరజ్‌ చోప్రాకు స్వర్ణం..

గోల్డెన్ బాయ్‌గా పేరుగాంచిన నీరజ్ చోప్రా సత్తాచాటాడు. ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు

Asian Games 2023: గోల్డెన్ బాయ్‌గా పేరుగాంచిన నీరజ్ చోప్రా సత్తాచాటాడు. ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత సూపర్ స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో నీరజ్ వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.ఈరోజు గెలిచిన పతాకంతో భారత్‌కు 17వ బంగారు పతకాన్ని అందించాడు.

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 17 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. నీరజ్ జావెలిన్ ఫైనల్ మొదటి రౌండ్‌లో ముందున్న సంగతి తెలిసిందే. కొన్ని సమస్యల కారణంగా నీరజ్ తొలి త్రో లెక్కలోకి రాలేదు. ఆ తర్వాత రెండో ప్రయత్నం చేసిన నీరజ్ 82.38 దూరాన్ని అధిగమించాడు. అదే సమయంలో భారతదేశానికి చెందిన కిషోర్ కుమార్ కూడా ఈ ఈవెంట్‌లో తన మొదటి త్రో 81.26 మీటర్లు విసిరాడు. తొలి రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. రెండో రౌండ్‌లో చోప్రా జావెలిన్‌ను 84.49 మీటర్లు విసిరాడు. ఇది అతని మొదటి త్రో కంటే చాలా ఎక్కువ. ఇక నాలుగో ప్రయత్నంలో 88.88 మీటర్ల దూరం విసిరాడు.

Also Read:Haj 2024: హజ్ యాత్రకు ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు వెల్లడి