Neeraj Chopra: నీరజ్‌ చోప్రా గాయం.. కామన్వెల్త్ నుంచి ఔట్!

కామన్వెల్త్‌ క్రీడల పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తాడని ఆశలు

Published By: HashtagU Telugu Desk
Zurich Diamond League

Neeraj (2)

కామన్వెల్త్‌ క్రీడల పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తాడని ఆశలు రేపిన నీరజ్‌ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా మీడియాకు వెల్లడించారు. ‘‘కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022లో నీరజ్‌ చోప్రా పాల్గొనడం లేదు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ తుది పోటీల సమయంలో గాయపడటంతో అతడు ఫిట్‌గా లేడు. దీని గురించి అతడు అసోసియేషన్‌కు సమాచారమందించాడు’’ అని మెహతా తెలిపారు.

  Last Updated: 26 Jul 2022, 04:12 PM IST